మన్మోహన్ సింగ్ అంటే మాకూ గౌరవమే - జైట్లీ

పార్లమెంట్ లో ఉభయసభలు మధ్యాహ్నం తిరిగి ప్రారంభమయ్యాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై చేసిన ఆరోపణలపై క్షమాపణ చెప్పాలంటూ గత నుండి ఉభయసభలను స్తంభింపజేస్తున్నాయి ప్రతిపక్షాలు.

Last Updated : Dec 27, 2017, 04:54 PM IST
మన్మోహన్ సింగ్ అంటే మాకూ గౌరవమే - జైట్లీ

పార్లమెంట్ లో ఉభయసభలు మధ్యాహ్నం తిరిగి ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ - "మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పైన, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నిబద్ధతలను  ప్రధాని మోదీ తన ప్రసంగాల్లో ఎక్కడా ప్రశ్నించలేదు" అని అన్నారు.

గుజరాత్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై చేసిన ఆరోపణలపై క్షమాపణ చెప్పాలంటూ గత నుండి ఉభయసభలను స్తంభింపజేస్తున్నాయి ప్రతిపక్షాలు. దీనిపై నేడు జైట్లీ రాజ్యసభలో సమాధానం  ఇచ్చారు . ప్రధాని మోదీ.. మన్మోహన్, అన్సారీ  నిబద్ధతలను ప్రశ్నించలేదని.. ప్రశ్నించాలని కూడా భావించలేదని స్పష్టం చేశారు. వారిద్దరి నిబద్ధతలపై మాకు అత్యంత గౌరవం ఉందని జైట్లీ మాట్లాడారు. 

 

 జైట్లీ ప్రసంగం ముగిసిన తరువాత.. కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ- "తమ పార్టీ సభ్యులు ఎవరైనా ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసి ఉంటే.. తాము వాటికి దూరంగా ఉన్నామని.. జైట్లీ ఈ విషయంపై వివరణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు"అన్నారు. భవిష్యత్తులో ఇలాటివి పురావృతం కాకూడదని కోరుకుంటున్నామని ఆజాద్ చెప్పారు. 

 

Trending News