ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెట్రో రైలును ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నం మేజెంటా లైనులో మెట్రో రైలును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ రైలు నోయిడాలోని బొటానికల్ గార్డెన్ నుంచి కల్కాజీ మందిర్ వరకు సేవలు అందించనుంది. ఈ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి యూపీ గవర్నర్ రామ్ నాయక్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు.
మోదీ మెట్రో రైలును ప్రారంభించి.. ఆ రైలులో కొంతదూరం ప్రయాణించారు. ఆయనతో పాటు గవర్నర్, సీఎం, పలువురు ప్రముఖులు కూడా ప్రయాణించారు. అయితే ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందని కారణంగా ఢిల్లీ సీఎం క్రేజీవాల్ హాజరుకాలేదు. ఈ రైలు సేవతో నోయిడా, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణ సమయం సగానికిపైగా తగ్గనుంది.
Noida: PM Narendra Modi onboard #DelhiMetro after inauguration of a stretch of the new Magenta line. The line connects Botanical Garden in Noida with Kalkaji Mandir in Delhi. pic.twitter.com/oEzY4f66wi
— ANI (@ANI) December 25, 2017