నేడు కర్నాటకలో పర్యటించనున్న ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేడు కర్నాటకలో పర్యటించనున్నారు.

Last Updated : Feb 19, 2018, 06:15 PM IST
నేడు కర్నాటకలో పర్యటించనున్న ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేడు కర్నాటకలో పర్యటించనున్నారు. శ్రవణబెళగోళలో నిర్వహించే భగవాన్ బాహుబలి 88వ మహామస్తాభిషేక మహోత్సవంలో ఆయన పాల్గొంటారు. అలానే విందుగిరి కొండపై కొత్తగా నిర్మించిన 630 మెట్ల మార్గాన్ని మోదీ ప్రారంభించనున్నారు.

మహామస్తాభిషేక మహోత్సవం అనంతరం, ప్రధాన మంత్రి మోదీ మైసూరు చేరుకుంటారు. అక్కడ ప్యాలెస్ క్వీన్ హమ్ సఫర్ ఎక్ష్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు మైసూరు, ఉదయపూర్ మధ్య నడుస్తుంది. అనంతరం మైసూరు-బెంగళూరు ఏమినిది లైన్ల హైవే మార్గానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత నగరంలో ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) ఆసుపత్రిలో కొత్త బ్లాక్ ను ప్రారంభిస్తారు. ఆనంతరం మైసూరులో నిర్వహించే బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తారు.

Trending News