కేంద్ర బడ్జెట్ 2018: ప్రముఖుల స్పందన

2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Last Updated : Feb 1, 2018, 05:50 PM IST
కేంద్ర బడ్జెట్ 2018:  ప్రముఖుల స్పందన

2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య బీమా, వ్యవసాయ రంగానికి కేటాయించిన తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తుండగా.. ఈ బడ్జెట్ మధ్యతరగతి వర్గాలకు 'చేదు' గా ఉందని విపక్షాలు మండిపడ్డాయి. బడ్జెట్‌ ప్రసంగంపై ప్రముఖుల స్పందనలు ఇలా..

‘విద్య, వైద్యం, వ్యవసాయానికి సంబంధించి నిధుల కేటాయింపు బాగుంది. ముఖ్యంగా జాతీయ ఆరోగ్య బీమా పథకం వల్ల పది కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. దీన్ని నేను అభినందిస్తున్నా’ -బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌

‘రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఆర్థిక మంత్రి జైట్లీ కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవు' - దేవేగౌడ, జేడీఎస్‌ నేత, మాజీ ప్రధాని

‘రైతులు, అట్టడుగు వర్గాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని ప్రభుత్వం డప్పాలు కొడుతోంది. వారికోసం అంతకు మించి చేయాల్సి ఉంది"  -మనీశ్‌ తివారీ, కాంగ్రెస్‌ నేత

'దేశంలోని 10 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆరోగ్య బీమా కల్పించడం హర్షించదగ్గ విషయమే. ఇది చరిత్రాత్మక బడ్జెట్‌’ -కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

‘ఇది గొప్ప బడ్జెట్‌. పేదలు, రైతులు, గిరిజనులకు పెద్దపీట వేశారు. భారత్‌ను ప్రపంచ ఆర్థికశక్తిగా నిలబెట్టేందుకు ఈ బడ్జెట్ సహకరిస్తుంది’ -కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

‘జైట్లీ బడ్జెట్ ప్రసంగం గంట నలభైఐదు నిమిషాల పాటు సాగింది. ఆ ప్రసంగంలో గంటపాటు పేదలనుద్దేశించే ప్రసంగించారు. ఇది చరిత్రాత్మక బడ్జెట్‌’ -కేంద్రమంత్రి ఎంజే అక్బర్‌

‘మోదీ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో తొలిసారి అతిపెద్ద ఆరోగ్య బీమా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనివల్ల ఏటా 50 కోట్ల మంది ప్రజలకు రూ.5లక్షల చొప్పున ఆరోగ్య బీమా వర్తించనుంది’ -దేవేంద్ర ఫడణవీస్‌, మహారాష్ట్ర సీఎం

‘సమాజంలోని అన్ని వర్గాల వారికి న్యాయం చేకూర్చేలా బడ్జెట్‌ ఉంది. రైతులు, పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. ప్రధాని మోదీ, జైట్లీని అభినందిస్తున్నా’ -పీయూష్‌ గోయల్‌, రైల్వేశాఖ మంత్రి

'ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను 8 కోట్లకు పెంచినందుకు ప్రధాని మోదీకి, ఆర్థికమంత్రి జైట్లీకి ధన్యవాదాలు' - స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి 

'సామాన్య పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి ఉద్దేశించిన ఇటువంటి సంస్కరణల బడ్జెట్‌ను తీసుకొచ్చిన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీకి అభినందనలు' -సురేష్ ప్రభు, కేంద్ర మంత్రి

'జాతీయ రాజధాని కోసం ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కొంత ఆర్థిక సహాయం చేస్తారని నేను భావించాను. ఢిల్లీ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ కొనసాగుతోంది'- అర్వింద్ క్రేజీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి

'మోదీ ప్రభుత్వం దేశానికి చేసింది ఏమీ లేదు, అలా చేస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. అవన్నీ సామాన్యుడిని మభ్యపెట్టడానికే. ప్రభుత్వ లెక్కలన్నీ కాగితాలమీదే'- తేజస్వి యాదవ్, ఆర్జేడీ నేత 

Trending News