బుధవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేగింది. బాబ్రీ మసీదును పునఃనిర్మించాలంటూ పలు ప్రాంతాల్లో గోడ పత్రాలు (పోస్టర్లు) కనిపించాయి. '25 ఏళ్ల నాటి విషాద సంఘటనలను మరిచిపోవద్దు' అనే అర్థం వచ్చే రీతిలో ఆ పోస్టర్లు ఉన్నాయి. అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందని పోలీసులు ఆలయాలు, మసీదుల వద్ద భద్రతపెంచారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని చోట్ల పోస్టర్లు కనిపించాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. అయితే ఈ పోస్టర్లను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు.