Pradhan Mantri Shram Yogi Maandhan Yojana : అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు వృద్ధాప్యంలో చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్' పథకాన్ని అమలుచేస్తోంది. ఈ పథకం ద్వారా 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతీ నెలా రూ.3000 ఫించన్ రూపంలో అందుతాయి.ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నట్లయితే ఇద్దరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. తద్వారా ఇద్దరికీ కలిపి నెలకు రూ.6 వేలు చొప్పున సంవత్సరానికి రూ.72 వేలు ఫించన్ రూపంలో పొందవచ్చు.
ప్రధానమంత్రి శ్రమ యోగి పథకానికి ఎవరు అర్హులు :
18-40 ఏళ్ల వయసు కలిగి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రతీ వ్యక్తి ఈ పథకానికి అర్హుడు/అర్హురాలు.
నెల వారీ ఆదాయం రూ.15 వేలకు మించకూడదు.
భవన నిర్మాణ కూలీలు, హమాలీలు, ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీలు, వీధి వ్యాపారులు, చెత్త ఏరి విక్రయించేవారు, ఇళ్లల్లో పనిచేసేవారు, బట్టలు ఉతికేవారు, రిక్షా తొక్కేవారు, భూమి లేని నిరుపేద కూలీలు, వ్యవసాయ కూలీలు, బీడి కార్మికులు, చేనేత కార్మికులు, లెదర్ వర్కర్స్ తదితరులు ఈ పథకానికి అర్హులు.
ప్రధానమంత్రి శ్రమ యోగి పథకం ద్వారా కలిగే బెనిఫిట్స్ :
ఈ పథకంలో సభ్యులుగా ఉన్న భార్యాభర్తలకు 60 ఏళ్లు నిండిన తర్వాత ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేలు చొప్పున ఫించన్ అందుతుంది. ఇద్దరికి కలిపి నెలకు రూ.6 వేలు, ఏడాదికి రూ.72 వేలు అందుతాయి.
ఈ పథకంలో సభ్యులుగా ఉన్న వ్యక్తి ఫించన్ పొందుతూ మరణించినట్లయితే అతను లేదా ఆమెకు వచ్చే ఫించనులో సగం వారి జీవిత భాగస్వామికి అందజేయబడుతుంది. అంటే ప్రతీ నెలా రూ.1500 అందుతాయి.
ఎంత చెల్లించాలి :
భార్యాభర్తలు ఈ పథకంలో సభ్యులుగా చేరాలంటే నెలకు ఒక్కొక్కరికి రూ.100 చొప్పున ఇద్దరికి కలిపి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి ఒక్కొక్కరికి రూ.1200, ఇద్దరికి కలిపి రూ.2400 చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత ఒక్కొక్కరికి ఏడాదికి రూ.36 వేలు ఫించన్ లభిస్తుంది. ఇద్దరికి కలిపి ఏడాదికి రూ.72 వేలు పొందుతారు.
ఎలా అప్లై చేసుకోవాలి :
సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా ఈ పథకం కోసం ఎన్‌రోల్ చేసుకోవచ్చు.
లేదా https://maandhan.in/shramyog వెబ్‌సైట్ ద్వారా సొంతం రిజిస్టర్ చేసుకోవచ్చు.
దీనికి మీ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా ఉంటే సరిపోతుంది.
ప్రతీ నెలా ఆటోమేటిగ్గా మీ ఖాతా నుంచి ఈ పథకానికి డబ్బులు చెల్లించేలా 'ఆటో డెబిట్'సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook