ఒక్క రూపాయి పరువునష్టం దావా వేసిన ప్రకాష్ రాజ్

బహుబాషా నటుడు ప్రకాష్ రాజ్ సిటీ కోర్టులో మైసూరు లోక్సభ ఎంపీ ప్రతాప్ సింహపై పరువు నష్టం దాఖలు చేశారు. 

Last Updated : Feb 28, 2018, 11:37 AM IST
ఒక్క రూపాయి పరువునష్టం దావా వేసిన ప్రకాష్ రాజ్

బహుబాషా నటుడు ప్రకాష్ రాజ్ సిటీ కోర్టులో మైసూరు లోక్సభ ఎంపీ ప్రతాప్ సింహపై పరువు నష్టం దాఖలు చేశారు. మంగళవారం కోర్టులో కేసు దాఖలు చేసిన తర్వాత ప్రకాష్ రాజ్ విలేఖరులతో మాట్లాడుతూ, ఎంపీగా ఉన్న ప్రతాప్‌ సింహ ఉన్నత స్థానంలో ఉంటూ సోషల్‌ మీడియాలలో తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలను పోస్టు చేశారని, అందుకే ఆయనకు ఒక్క రూపాయి పరువు నష్టం దావా వేసినట్లు చెప్పారు. ప్రకాశ్ రాజ్ న్యాయవాది మహాదేవస్వామి మాట్లాడుతూ, కేసు విచారణ అనంతరం తీర్పు మార్చి 3న వెలువడుతుందని అన్నారు. 

డబ్బు కోసం అని అతనిపై దావా వేయలేదని ప్రకాష్ రాజ్ అన్నారు. సమాజంలో బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం సోషల్ మీడియాని ఇలా దుర్వినియోగం చేస్తున్నవారికి ఒక గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో ఇలా చేశానని అన్నారు. 

ఇటీవల మోదీపై కర్ణాటకకు సంబంధించిన పలు విషయాలు మీడియా ద్వారా ప్రకాశ్ రాజ్ ప్రశ్నిస్తే, దానికి కౌంటర్‌గా ప్రతాప్‌ సింహ.. తన కుమారుడు చనిపోయినప్పుడు ప్రకాష్ రాజ్ ఒక డ్యాన్సర్‌తో ఉన్నట్లు పోస్టు చేశారు. అలాంటి వ్యక్తి మోదీ గురించి మాట్లాడే అర్హత లేదని ట్వీట్‌ చేశాడు. 

Trending News