బీజేపీయేతర ముఖ్యమంత్రులు స్పందించాల్సిన సమయం ఇది: ప్రశాంత్ కిషోర్

పౌరసత్వ సవరణ బిల్లు 2019 (CAB 2019), జాతీయ పౌర పట్టిక(NRC)లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఈ రెండు అంశాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

Last Updated : Dec 13, 2019, 07:45 PM IST
బీజేపీయేతర ముఖ్యమంత్రులు స్పందించాల్సిన సమయం ఇది: ప్రశాంత్ కిషోర్

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లు 2019 (CAB 2019), జాతీయ పౌర పట్టిక(NRC)లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఈ రెండు అంశాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొంది చట్టరూపు దాల్చడంతో.. ఇక దీని అమలును ఆపేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు. ఈ బిల్లును వ్యతిరేకించాలని, రాజ్యాంగాన్ని కాపాడండి’’ అంటూ బీజేపీయేతర ముఖ్యమంత్రులకు ప్రశాంత్ కిశోర్ పిలుపునిచ్చారు. ఇదే విషయమై ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ.. ‘‘పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఇక ఈ అంశం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉంటుందని భారత ఆత్మను కాపాడే బృహత్తర బాధ్యత ఈ చట్టాల్ని అమల్లోకి తెచ్చే 16 మంది బీజేపీయేతర ముఖ్యమంత్రులదే అని అన్నారు. ఇప్పటికే పంజాబ్, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులు క్యాబ్‌కు, జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా తమ గొంతు వినిపించగా.. మిగతా ముఖ్యమంత్రులు కూడా తమ వైఖరి వెల్లడించాలని ప్రశాంత్ పేర్కొన్నారు.  

ప్రస్తుతం జనతా దళ్(యునైటెడ్) పార్టీకి ఉపాధ్యక్షుడి హోదాలోనూ ఉన్న ప్రశాంత్ కిషోర్..  సోమవారం లోక్‌సభలో తన సొంత పార్టీ అయిన జనతాదల్ యునైటెడ్   పార్టీ పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు తెలపడంపై అసహనం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. మత ప్రాతిపదికన ప్రజలపై వివక్ష చూపించే విధంగా ఈ బిల్లుకు మద్దతు ఇవాల్సిన అవసరం ఏమిటని ఆయన జేడీయూని నిలదీశారు. లౌకికత్వం, గాంధీ సిద్ధాంతాలను ఆచరిస్తామని చెప్పి పార్టీ రాజ్యాంగంలో రాసుకుని... ఇలాంటి బిల్లుకు మద్దతు ఇవ్వడంలో అర్థం లేదని ఆయన సొంత పార్టీకే హితవు పలికారు.

Trending News