Modi Aerial Survey: హుదూద్ తరువాత అత్యంత తీవ్ర తుపానుగా తౌక్టే తుపానును చెప్పుకోవచ్చు. తౌక్టే పెను విధ్వంసమే సృష్టించింది. కరోనా విపత్కర పరిస్థితుల వేళ తుపాను భీభత్సం మరింత విషాదాన్ని మిగిల్చింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు.
అరేబియా సముద్రం(Arabian Sea)లో ఏర్పడిన తౌక్టే తుపాను అత్యంత తీవ్ర తుపానుగా రూపం దాల్చింది. తీరం దాటుతూ భీకరమైన రాకాసి గాలులు, భారీ వర్షాలతో తీరప్రాంతాలపై విరుచుకుపడింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో పెను విధ్వంసమే సృష్టించింది. పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్థంబాలు విరిగిపడ్డాయి. ముంబై, అహ్మదాబాద్ సహా గుజరాత్ రాష్ట్రంలోని 35 తాలూకాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. అతి భీకరంగా విరుచుకుపడ్డ తౌక్టే తుపానుతో(Tauktae Cyclone) భారీ ఆస్థి నష్టం సంభవించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Pm modi) ఇవాళ తుపాను ప్రభావిత ప్రాంతాలైన గుజరాత్, డయ్యూలలో ఏయరియల్ సర్వే నిర్వహించారు. ఉనా, డయ్యూ, జాఫరాబాద్, మహువా ప్రాంతాల్ని మోదీ ఏరియల్ సర్వే( Aerial Survey) ద్వారా పరిశీలించారు. ప్రధాని మోదీ వెంట గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సైతం ఉన్నారు. తుపాను ప్రభావానికి గురైన ప్రాంతాల్లో నష్టాన్ని ఇంకా అంచనా వేయాల్సి ఉంది. అహ్మదాబాద్‌లో జరిగే సమీక్షలో సహాయక చర్యలు, తుపాను నష్టంపై చర్చించనున్నారు.
Also read: Lockdown Rules Break: లాక్‌డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించిన ముఖ్యమంత్రి కుమారుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook