పంజాబ్‌లో దీపావళి సంబరాలపై ఆంక్షలు

Last Updated : Oct 13, 2017, 05:07 PM IST
పంజాబ్‌లో దీపావళి సంబరాలపై ఆంక్షలు

ఢిల్లీలో బాణాసంచా విక్రయాలపై ఆంక్షలు విధించి షుప్రీంకోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్నుంచి తేరుకోకముందే పంజాబ్ హర్యాన హైకోర్టు మరోషాకిచ్చింది. దీపావళి పండగ రోజు టపాసులు కాల్పేందుకు సమయపరిమితి విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు మాత్రమే బాణ‌సంచా కాల్చాలని ప్రజలకు సూచించింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది.

అనూహ్యంగా పెరిగిపోతున్న కాలుష్యం నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో  బాణాసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు నిషేదించడం విధించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలపై దేశంలో భిన్నాబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రామ్ దేవ్ బాబాతో పాటు పలువురు హిందుత్వ వాదులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే పంజాబ్ కోర్టు తీసుకున్న నిర్ణయం మరింత చర్చనీయ అంశంగా మారింది.

Trending News