కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. అమెరికా తర్వాత దీని ప్రభావం భారత్‌లోనే అధికంగా ఉంది. కరోనా వైరస్ బారిన పడిన బిహార్ (Bihar)కు చెందిన ఐజీ వినోద్ కుమార్ ఆదివారం ఉదయం కన్నుమూశారు (Purnea IG Binod Kumar passed away). కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆయనకు టెస్టులు చేయించగా కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. మూడు రోజుల కిందట పాట్నాలోని ఎయిమ్స్ (Patna AIIMS)లో చేరి చికిత్స పొందుతున్న వినోద్ కుమార్ పరిస్థితి విషమించడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ఈ విషయాన్ని ధృవీకరించారు.
ఐజీ వినోద్ కుమార్ (IG Binod Kumar) కుటుంబసభ్యులకు సమాచారం అందించగా వారు పాట్నాకు బయలుదేరారు. బిహార్ రాష్ట్రంలో పలువురు కీలక వ్యక్తులు కరోనాతో ఇటీవల మరణించారు. తాజాగా ఆ జాబితాలోకి పూర్ణియా ఐజీ వినోద్ కుమార్ చేరారు. ఇటీవల జేడీయూ సీనియర్ నేత, బిహార్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కపిల్ డియో కామత్ (69), మరో మంత్రి వినోద్ కుమార్ సింగ్ (50) కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయిన విషయం తెలిసిందే.
పూర్ణియా ఐజీ వినోద్ కుమార్ అంత్యక్రియలు పాట్నాలో నిర్వహించనున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. బిహార్‌లో ప్రముఖ వ్యక్తుల మరణాలు అటు రాజకీయ వర్గాలలో, ఇటు పోలీసు శాఖలో ఆందోళన పెంచుతున్నాయి. కాగా, బిహార్‌లో ఇప్పటివరకూ 1,91,619 కరోనా కేసులు నమోదు కాగా, దాదాపు 1000 మంది కరోనా బారిన పడి మరణించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe