రాహుల్ నామినేషన్; ఏఐసీసీ చీఫ్ గా ఎంపిక లాంఛనమే

కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యాలయంలో పార్టీ చీఫ్ పదవికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. 

Last Updated : Dec 4, 2017, 04:09 PM IST
రాహుల్ నామినేషన్; ఏఐసీసీ చీఫ్ గా ఎంపిక లాంఛనమే

ఢిల్లీ: కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యాలయంలో పార్టీ చీఫ్ పదవికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాహుల్ పేరును పార్టీ చీఫ్ గా ప్రతిపాదించారు.  

శుక్రవారం నుండి మొదలైన నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగుస్తుంది. మధ్యాహ్నం 3 గంటలవరకు టైం ఉంది కనుక ఇతరులెవ్వరూ నామినేషన్ పత్రాలు దాఖలు చేయకపోతే ఆయనే పార్టీ చీఫ్. ఎలాగో కాంపిటీషన్ ఉండదు కాబట్టి అనుకున్న విధంగానే రాహుల్ ను పార్టీ చీఫ్ గా ప్రకటించే అవకాశం ఉంది. ఒకేవేళ ఎవరైనా నామినేషన్ వేస్తే17న పోలింగ్, 19న కౌంటింగ్ జరుగుతుంది. 

రాహుల్ నామినేషన్ వేస్తున్న వేళ వివిధ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ బాట పట్టారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేతలు ఢిల్లీకి వచ్చారు.

కాగా సోనియా గాంధీ 1998 నుండి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా కొనసాగుతున్నారు. 2013లో రాహుల్ పార్టీ ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. అనారోగ్య కారణాల వల్ల కాబోలు.. సోనియా పార్టీ బాధ్యతలను రాహుల్ కు అప్పచెప్పుతున్నారని టాక్!

Trending News