కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బూటా సింగ్ (Buta Singh) (86) కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బూటా సింగ్ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) సంగ్రామానికి సమయం దగ్గరపడింది. మరో నాలుగు రోజుల్లో 28న బీహార్ మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఓ వైపు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు (BJP-JDU), మరోవైపు మహాఘట్ బంధన్ పార్టీలు ( Congress-RJD-Left) ప్రచారంతో హోరెత్తిస్తూ మాటల తూటాలు పేల్చుతున్నాయి.
కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ (Kamal Nath) చేసిన ‘ఐటం’ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ మహిళా నాయకురాలు, దాబ్రా బీజేపీ అభ్యర్థిని ఇమార్తి దేవి (Imarti Devi) ని ఐటం అని సంభోదించడంపై బీజేపీ నాయకులు కమల్ నాథ్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి రాహుల్ గాంధీ కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
కరోనావైరస్ (Coronavirus) సోకిన తర్వాత హోం క్వారంటైన్లో ఉండకుండా హత్రాస్ ( Hathras ) బాధితురాలి ఇంటికెళ్లిన ఆప్ ఎమ్మెల్యేపై యూపీ పోలీసులు (UP Police) కేసు నమోదు చేశారు. అంటువ్యాధుల చట్టం ( Epidemic Act) కింద ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ (AAP MLA Kuldeep Kumar) పై కేసు నమోదు చేసినట్లు హత్రాస్ ఎస్పీ బుధవారం తెలిపారు.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో 19 ఏళ్ల యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యోగి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తును ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (( CM Yogi Adityanath) ) మొదట సిట్ (SIT) ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణను సీబీఐ (CBI) కూడా అప్పగించారు.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో 19 ఏళ్ల యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( CM Yogi Adityanath) మరో కిలక నిర్ణయం తీసుకున్నారు.
Gulam Nabi Azad Comments On Congress Party Leadership | కాంగ్రెస్ పార్టీలో లోపాలను ఎత్తిచూపుతూ పార్టీ ప్రక్షాళన అంశంపై సోనియాకు ఘాటు లేఖ రాసిన 23 మంది నేతలలో ఒకరైన గులాం నబీ ఆజాద్ పార్టీలో అంతర్గత వ్యవహారాలను తప్పుపట్టారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం చాలా వాడీవేడిగా జరుగుతోంది. ఈ సమావేశం కొత్త అధ్యక్షుడి ఎంపిక గురించి జరుగుతుందని ముందుగా అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఇది సీన్ రివర్స్ అయి 23మంది సీనియర్లు రాసిన లేఖ చుట్టూ తిరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సంక్షోభంపై చర్చించేందుకు నిర్వహిస్తోన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) కీలక సమావేశం వాడీవేడీగా కొనసాగుతోంది. పార్టీ సీనియర్ నేతలపై రాహుల్ గాంధీ ఆగ్రహం (Rahul Gandhi Comments At CWC) వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి ఆయన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) నిర్వహణ గురించి ప్రశ్నలు సంధించారు.
నేడు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. అతిపిన్న వయసులో ప్రధాని అయి ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన నేత రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన తనయుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi On Rajiv Gandhi Birth Anniversary) నివాళులర్పించారు.
కాంగ్రెస్ పార్టీ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. ముఖ్యంగా వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రుణఎగవేతదారుల రుణాలను మాఫీ చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
‘రాహుల్ గాంధీని ఎంపీగా ఎందుకు ఎన్నుకున్నారు. రాహుల్‌తో నాకు వ్యక్తిగతంగా ఏ విభేదాలు లేవు. చాలా మంచి వ్యక్తి. కానీ నవ భారతానికి ఓ వంశానికి చెందిన ఐదవ తరం నేత అవసరం లేదు. 2024 ఎన్నికల్లో రాహుల్‌ను ఎన్నుకోవద్దు’ అని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ సూచించారు.
రాహుల్ గాంధీ 'రేప్ ఇన్ ఇండియా' వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పించాలని ఝార్ఖండ్ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
''నా పేరు రాహుల్ సావర్కర్ కాదు... నా పేరు రాహుల్ గాంధీ'' అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన సంచలన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారంరేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణలో విరివిగా ప్రచారం చేసుకొనేందుకు మహాకూటమి నేతలు సన్నద్ధమవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.