న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కొద్దీ రోజుల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాహుల్ బుధవారం ఘాటైన ట్వీటు చేశారు. బడ్జెట్ 2020పై ప్రధాని, ఆర్ధిక మంత్రి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. అనేక రంగాల్లో దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిందని, వీటన్నిటికీ కారణం ప్రధాని మోదీయేనని ఎద్దేవా చేశారు.
Modi & his dream team of economic advisors have literally turned the economy around.
Earlier:
GDP: 7.5%
Inflation: 3.5%Now:
GDP: 3.5%
Inflation: 7.5%The PM & FM have absolutely no idea what to do next. #Budget2020
— Rahul Gandhi (@RahulGandhi) January 29, 2020
దేశ ఆర్ధిక వ్యవస్థ, అదుపు తప్పిన పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏమి చేయాలో ప్రధానికి, ఆర్థిక మంత్రికి అర్ధం కావడం లేదని రాహుల్ వ్యాఖ్యానించారు. జీడిపిని తలదన్నుతూ ద్రవ్యోల్బణం దూసుకువెళ్లుతోందని పేర్కొన్నారు. ఇంతకు ముందు జిడిపి 7.5 శాతం, ద్రవ్బోల్బణం3.5. ఇప్పుడు అది తారుమారై జిడిపి 3.5 శాతం, ద్రవ్యోల్బణం 7.5 శాతం పడిపోయిందని అన్నారు. ఇంతటి దారుణమైన ఆర్ధిక పరిస్థితి దేశంలో ఎన్నడూ చూడలేదన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..