rajini kanth : రజినీకాంత్ పార్టీ పేరు ప్రకటించేది ఎప్పుడో తెలుసా..?

తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్.. రాజకీయ ఆరంగేట్రం ఇప్పటికే ఖాయమైంది. సొంత పార్టీ పెట్టుకుంటామని ఆయన ఎప్పుడో సంకేతాలు ఇచ్చారు. అందుకోసం తన ఫ్యాన్ క్లబ్ రజినీ మక్కల్ మండ్రుం పేరుతో సన్నాహాలు చేస్తున్నారు.

Last Updated : Mar 12, 2020, 10:50 AM IST
rajini kanth : రజినీకాంత్  పార్టీ పేరు ప్రకటించేది ఎప్పుడో తెలుసా..?

తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్.. రాజకీయ ఆరంగేట్రం ఇప్పటికే ఖాయమైంది. సొంత పార్టీ పెట్టుకుంటామని ఆయన ఎప్పుడో సంకేతాలు ఇచ్చారు. అందుకోసం తన ఫ్యాన్ క్లబ్ రజినీ మక్కల్ మండ్రుం పేరుతో సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు తన అభిమానులతో చర్చించి పార్టీ పేరు ప్రకటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.  

Read Also: ఛీ..ఛీ.. మీ తెలివి తెల్లారినట్టే ఉంది.. !!

తలైవా ఇప్పటికే 15 రోజుల్లో రెండుసార్లు  రజినీ మక్కల్ మండ్రుం జిల్లాల కార్యదర్శులతో భేటీ అయ్యారు. పార్టీ పేరు, విధి విధానాలు, జెండా ఎలా ఉండాలనే అంశాలపై చర్చించారు. వారి అభిప్రాయాలు సేకరించారు. అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశ్యంతో పార్టీని డిజైన్ చేయాలని సంకల్పించారు. నిన్నటితో అభిమానులతో  భేటీలు ముగిసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఏ క్షణమైన పార్టీ పేరు ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. 

Read Also:  కరోనా దెబ్బకు 'బేర్'మన్న సెన్సెక్స్

ఈ రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటి దగ్గర సందడి  వాతావరణం కనిపించింది.  ఆయన ఇంటి దగ్గరకు భారీగా అభిమానులు చేరుకున్నారు. వారి చేతుల్లో స్టార్ మధ్యలో రజనీకాంత్ ఫోటో ఉన్న జెండాలు ఉన్నాయి. వారంతా ఇవాళ సూపర్ స్టార్ రాజకీయ పార్టీ పేరును ప్రకటిస్తారని ఎదురు చూస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

 

Trending News