Rajyasabha Bypoll: రాజ్యసభ ఉపఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆరు రాజ్యసభ స్థానాల ఖాళీలకు ఉపఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మరోవైపు రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉపఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వెలువడింది.
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఖాళీ అయిన 6 రాజ్యసభ స్థానాల ఉపఎన్నికకు షెడ్యూల్(Rjyasabha Bypolls Schedule)విడుదలైంది. వీటితో పాటు బీహార్లో ఒక శాసనమండలి స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మరోవైపు పశ్చిమ బెంగాల్, ఒడిశాలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం జారీ చేసింది. అసోం, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 6 రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 4వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. ఇక పుదుచ్చేరి రాజ్యసభ సభ్యుడు ఎన్ గోకులకృష్ణన్ పదవీకాలం అక్టోబర్ 6వ తేదీన ముగియడంతో ఈ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. ఉదయం 9 గంటల్నించి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ ఉంటుంది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 4న ఉంటుంది. రాజ్యసభ ఉప ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు కరోనా మార్గదర్శకాల మధ్య ఎన్నికలు జరపనున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)పోటీ చేయనున్న భవానీపూర్ నియోజకవర్గం ఉపఎన్నిక కూడా ఇందులో భాగంగా జరగనుంది.
Also read: Movie Tickets: ఏపీలో ఇక నుంచి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థ, పర్యవేక్షణ ప్రభుత్వానిదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook