జియో దీపావళి ధమాకా; 100 శాతం క్యాష్‌ బ్యాక్‌

జియో దీపావళి ధమాకా; 100 శాతం క్యాష్‌ బ్యాక్‌

Updated: Oct 20, 2018, 03:43 PM IST
జియో దీపావళి ధమాకా; 100 శాతం క్యాష్‌ బ్యాక్‌

సెప్టెంబరు త్రైమాసికానికి రూ.681 కోట్ల లాభాలు ఆర్జించిన తర్వాత, 25 కోట్ల మందికి పైగా వినియోగదారులను కలిగి ఉన్న రిలయన్స్ జియో ఓ బంపరాఫర్‌ను ప్రవేశపెట్టింది. రిలయన్స్‌ జియో దీపావళి సందర్భంగా ఓ కొత్త రీఛార్జ్‌ ఆఫర్ ను వినియోగదారులకు ప్రకటించింది. రూ.1,699తో రీఛార్జ్‌ చేసుకుంటే ఏడాది పాటు వ్యాలిడిటీ ఉండేలా ఓ కొత్త ప్లాన్‌ను జియో ప్రకటించింది. ఆ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.

రూ.1,699తో రీఛార్జ్‌ చేసుకుంటే సంవత్సరంలో వరకు ఉచితంగా రోజుకు 1.5 జీబీ 4జీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లతోపాటు అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ , అపరిమిత రోమింగ్ పొందవచ్చు. కొన్ని రకాల జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ ఆఫర్‌నూ కల్పించింది.

'మై జియో' అనే యాప్‌ ద్వారా రూ.149 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్లతో రీఛార్జ్‌ చేసుకున్నవారికి 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను డిజిటల్ కూపన్ల రూపంలో అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ కూపన్లను రిలయన్స్‌ డిజిటల్, డిజిటల్‌ ఎక్స్‌ప్రెస్‌, డిజిటల్‌ ఎక్స్‌ప్రెస్‌ మినీ స్టోర్లలో రీడీమ్‌ చేసుకోవచ్చంది. ఈ కూపన్లు రీడీమ్‌ చేసుకునేందుకు చివరి తేదీ డిసెంబరు 31, 2018 కాగా.. నవంబర్ 30, 2018లోగా రీచార్జీ చేయించుకుంటే 100 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ పొందవచ్చని పేర్కొంది.