SBI Dussehra Offer: ఎస్‌బీఐ దసరా పండుగ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు ఇవే

SBI Dussehra Offer: దసరా పండుగ సీజన్ సమీపిస్తోంది. పండుగ వేళ కావడంతో బ్యాంకులు, ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కొత్తగా ఎస్‌బీఐ తన కస్టమర్లకు పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ల వర్షం కురిపించింది. అదేంటో పరిశీలిద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 23, 2021, 09:36 PM IST
  • దసరా పండుగ పురస్కరించుకుని ఎస్‌బీఐ ప్రత్యేక ఆఫర్లు
  • హౌసింగ్ లోన్, పర్సనల్, గోల్డ్ లోన్‌పై ప్రత్యేక ఆఫర్లు
  • క్రెడిట్ స్కోర్ బాగుంటే మరింతగా డిస్కౌంట్
SBI Dussehra Offer: ఎస్‌బీఐ దసరా పండుగ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు ఇవే

SBI Dussehra Offer: దసరా పండుగ సీజన్ సమీపిస్తోంది. పండుగ వేళ కావడంతో బ్యాంకులు, ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కొత్తగా ఎస్‌బీఐ తన కస్టమర్లకు పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ల వర్షం కురిపించింది. అదేంటో పరిశీలిద్దాం.

పండుగలొస్తున్నాయంటే ఆన్‌లైన్ షాపింగ్(Online Shopping)కావచ్చు ఆఫ్‌లైన్ కావచ్చు ప్రత్యేక ఆఫర్లు తెగ వస్తుంటాయి. దసరా పండుగ సమీపిస్తుండటంతో ఈ కామర్స్ సంస్థలు, బ్యాంకులు ఆఫర్లు ప్రకటించాయి. ఈ కామర్స్ సంస్థలు భారీగా డిస్కౌంట్స్ ఇస్తుంటే, బ్యాంకులు.. గృహ, వ్యక్తిగత, కారు, బంగారం రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు పండుగ ఆఫర్ల వర్షం కురిపించింది. గృహరుణం, కారు రుణం, బంగారు రుణం, వ్యక్తిగత రుణంపై ఇంకా చాలా ప్రయోజనాలు(SBI Special Offers)అందిస్తున్నట్టు ఎస్బీఐ తెలిపింది.

ఆఫర్ల గురించి ఎస్‌బీఐ(SBI)ట్వీట్ ద్వారా ప్రస్తావించింది. కారు రుణం, బంగారం, వ్యక్తిగత రుణాలకు సంబంధించిన ఆఫర్లను ట్వీట్‌లో వెల్లడించింది. కారు రుణాన్ని లక్షకు 1539 రూపాయల ఈఎమ్ఐ, బంగారం రుణాన్ని 7.5 శాతం వడ్డీతోనూ, వ్యక్తిగత రుణాన్ని లక్షకు 1832 రూపాయల ఈఎంఐకే అందిస్తున్నట్టు ఎస్బీఐ తెలిపింది. అత్యధిక క్రెడిట్ స్కోర్ ఉంటే రుణ మొత్తంతో ఎలాంటి సంబంధం లేకుండా 6.70 శాతం రుణాలు ఇవ్వనున్నట్టు పేర్కొంది. 75 లక్షలపైబడిన రుణాలకు ఒక కస్టమర్ 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ స్కోర్(Credit Score) బాగుంటే 1 శాతం వడ్డీ రేటు తగ్గిస్తోంది. 30 ఏళ్లకు చెల్లించే విధంగా 75 లక్షల రుణం తీసుకుంటే..ఈ కాల పరిమితిలో 8 లక్షలకు పైగా వడ్డీభారాన్ని తగ్గించుకోగలుగుతారు. 

Also read: Tesla Electric Car: టెస్లా ఎలక్ట్రిక్ కారు ఇండియా ఎంట్రీకు కొత్తగా మరో సమస్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News