Cheetah dies in Kuno National Park: ప్రాజెక్టు టైగర్ లో భాగంగా... విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న చీతాల్లో మరొకటి మృతి చెందింది. దక్షిణాఫ్రికా నుండి భారత్ లోని కునో నేషనల్ పార్కుకు వచ్చిన 12 చిరుతల్లో ఒకటైన 'ఉదయ్' అనే చీతా అనారోగ్యంతో ఆదివారం ఉదయం మరణించింది. దీని వయస్సు ఆరేళ్లు. పోస్టుమార్టం అనంతరం మృతికి గల కారణాలు వెల్లడిస్తామని అటవీశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
దేశంలో చీతాలను తిరిగి ప్రవేశపెట్టే లక్ష్యంతో ప్రపంచంలోని మొట్టమొదటి ఇంటర్‌కాంటినెంటల్ ట్రాన్స్‌లోకేషన్ ప్రాజెక్ట్‌లో భారతదేశానికి తీసుకువచ్చిన 20 చిరుతల్లో ఇప్పుడు 18 చిరుతలు మిగిలి ఉన్నాయి. సాషా అనే ఐదేళ్ల నమీబియా చిరుత కిడ్నీ ఇన్ఫెక్షన్ కారణంగా గత నెలలో మరణించింది.
Also Read: China: గాల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి ఇండియాకు చైనా రక్షణ మంత్రి
నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతలను ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది తన పుట్టినరోజు సందర్భంగా కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికాకు చెందిన మరో 12 చీతాలను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. ఇందులో ఏడు మగ, ఐదు ఆడ చిరుతలు ఉన్నాయి. చీతాలు 74 ఏళ్ల క్రితమే భారత్ లో అంతరించిపోయాయి. 1952లో చీతాలు పూర్తిగా అంతరించిపోయినట్లు కేంద్రం ప్రకటించింది.
Also Read: Kerala Water Metro: దేశంలో మొట్టమొదటి వాటర్ మెట్రో.. ప్రత్యేకతలు తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook