హర్యానా: వివాదాస్పద మతగురువు రాంపాల్(67)కు హిస్సార్ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదును విధించింది. 2014లో రెండు వేర్వేరు హత్య కేసుల్లో రాంపాల్‌తో పాటు అతని 27 మంది అనుచరులపై అభియోగాలు నమోదయ్యాయి. అక్టోబరు 11న హర్యానా కోర్టు రెండు హత్య కేసుల్లో రాంపాల్‌ను దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దోషిగా తేలిన ఆయన్ను ఇవాళ కోర్డు శిక్ష ఖరారు చేసింది. మరో కేసులో అక్టోబరు 17న తీర్పు వెలువరించనుంది. రాంపాల్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో హిస్సార్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
నవంబర్ 2014లో అరెస్ట్ అయినప్పటి నుంచి రాంపాల్ ఆయన అనుచరులు జైలు జీవితం గడుపుతున్నారు. 2014 నవంబర్‌లో రాంపాల్, ఆయన అనుచరులపై బర్వాలా పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. రాంపాల్ ఆశ్రమంలో బాబా, ఆయన అనుచరుల నిర్బంధంలో ఉన్న తమ భార్యలు హత్య గావించబడ్డారని ఢిల్లీకి చెందిన వారి భర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
నాలుగునారేళ్ల విచారణ అనంతరం.. ఈ రెండు కేసుల్లో రాంపాల్ దోషిగా తేలారు. అందులో ఒకదానికి ఇవాళ జీవిత ఖైదు పడగా.. రెండో కేసులో కూడా రాంపాల్ ఇప్పటికే దోషిగా తేలాడు. దానికి సంబంధించి శిక్ష రేపు ఖరారు కానుంది.
గతంలో రాంపాల్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించగా.. రాంపాల్ అరెస్ట్‌ను అడ్డుకునేందుకు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాంతో కొన్ని రోజుల పాటు అరెస్ట్ నుంచి తప్పించుకోగా.. చివరకు పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. పలువురు అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆనాటి ఆందోళనల్లో ఆరుగురు మరణించగా, పదుల సంఖ్యలో మంది గాయపడ్డారు.
Self-styled godman Rampal has been sentenced to life imprisonment in connection with two murder cases. pic.twitter.com/LxB4cQysvx
— ANI (@ANI) October 16, 2018