NOVAVAX Vaccine: సెప్టెంబర్ నాటికి మరో వ్యాక్సిన్ ప్రవేశపెట్టనున్న సీరమ్ ఇనిస్టిట్యూట్

NOVAVAX Vaccine: ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారైన సీరమ్ ఇనిస్టిట్యూట్ మరో వ్యాక్సిన్ అందుబాటులో తీసుకురానుంది. చివరి దశలో ఉన్న క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని మార్కెట్లో రానుంది. చిన్నారులపై కూడా త్వరలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 16, 2021, 03:06 PM IST
NOVAVAX Vaccine: సెప్టెంబర్ నాటికి మరో వ్యాక్సిన్ ప్రవేశపెట్టనున్న సీరమ్ ఇనిస్టిట్యూట్

NOVAVAX Vaccine: ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారైన సీరమ్ ఇనిస్టిట్యూట్ మరో వ్యాక్సిన్ అందుబాటులో తీసుకురానుంది. చివరి దశలో ఉన్న క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని మార్కెట్లో రానుంది. చిన్నారులపై కూడా త్వరలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్( Covishield)ను ఉత్పత్తి చేస్తున్న ప్రముఖ వ్యాక్సిన్ కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ మరో వ్యాక్సిన్‌ను త్వరలో ప్రవేశపెట్టనుంది. నోవావాక్స్ వ్యాక్సిన్ ప్రస్తుతం చివరిదశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. ఇది పూర్తయితే డీసీజీఐ అనుమతి తీసుకుని సెప్టెంబర్ నాటికి మార్కెట్లో వ్యాక్సిన్ ప్రవేశపెట్టేందుకు సీరమ్ ఇనిస్టిట్యూట్ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు ఇదే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను చిన్నారులపై కూడా నిర్వహించే ఆలోచన ఉందని సీరమ్ ఇనిస్టిట్యూట్(Serum Institute) తెలిపింది. 

నోవావాక్స్ వ్యాక్సిన్ (Novavax Vaccine) ఒక మోస్తరు నుంచి తీవ్రమైన వైరస్ బాధితుల్లో 100 శాతం రక్షణ ఇస్తుందని..సగటున 90 శాతం సామర్ధ్యాన్ని కలిగి ఉందని సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదార్ పూణావాలా (Adar Poonawalla) తెలిపారు. గ్లోబల్ ట్రయల్స్ డేటా ఆధారంగా లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశముందన్నారు. నవంబర్ నాటికి అందుబాటులో వస్తుందని భావిస్తున్నామని..రెగ్యులేటరీ ఆమోదం పొందితే సెప్టెంబర్ నాటికే ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ఇదే వ్యాక్సిన్‌ను చిన్నారులపై జూలైలో క్లినికల్ ట్రయల్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టు అదార్ పూణావాలా తెలిపారు. నోవావాక్స్ అన్ని రకాల వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేస్తుందని నోవావాక్స్ ఇటీవల ప్రకటించింది. అమెరికా, మెక్సికో దేశాల్లో 119 కేంద్రాల్లో 29 వేల 960 మందిపై ట్రయల్స్ నిర్వహిచారు. 

Also read: India Corona Cases Updates: ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు, తగ్గిన Covid-19 మరణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News