Madhya Pradesh Fire Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం... ఏడుగురు సజీవ దహనం...

Madhya Pradesh Fire Accident: ఇండోర్‌లోని ఓ రెండంతస్తుల భవనంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమ్యారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 7, 2022, 10:09 AM IST
  • మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం
  • ఏడుగురు సజీవ దహనం
  • రెండంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు
Madhya Pradesh Fire Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం... ఏడుగురు సజీవ దహనం...

Madhya Pradesh Fire Accident: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ రెండంతస్తుల భవనంలో శనివారం (మే 7) తెల్లవారుజామున భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రమాద సమయంలో భవనంలో ఉన్న మరో 9 మందిని రక్షించగలిగారు. వీరిలో ఐదుగురు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు కొందరు చెబుతున్నారు. భవనంలోని బేస్‌మెంట్‌లో తెల్లవారుజామున 3.10 గం. సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు తెలిపారు. మొదట పార్కింగ్‌లో ఉన్న రెండు బైక్స్‌కి మంటలు అంటుకున్నాయని... ఆ తర్వాత భవనమంతా వ్యాపించాయని చెప్పారు. 

అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దాదాపు 3 గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్‌లో ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్ లేదని పోలీసులు తెలిపారు. బిల్డింగ్ యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

అగ్నిప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. మృతులకు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. 

ముంబైలో అగ్నిప్రమాదం :

మహారాష్ట్ర ముంబైలోని సాంటాక్రూజ్ ప్రాంతంలో ఉన్న ఎల్ఐసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో కంప్యూటర్లు, ఫైల్ రికార్డ్స్, ఫర్నీచర్, ధ్వంసమయ్యాయి. ఎలక్ట్రిక్ వైరింగ్ పూర్తిగా కాలిపోయింది. ప్రస్తుతం 8 ఫైరింజన్లు మంటలు ఆర్పుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Also Read: LPG Cylinder Price Hike: సామాన్యులకు మరో షాక్... పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

Also Read: Sun Transit May 2022: మే 15 నుండి సూర్య సంచారం.. ఈ 6 రాశుల తలరాతే మారిపోనుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News