కారు, ట్రక్కు ఢీకొని ఏడుగురు మృతి, ఐదుగురికి గాయాలు

కారు, ట్రక్కు ఢీకొని ఏడుగురు మృతి, ఐదుగురికి గాయాలు

Updated: Nov 12, 2019, 02:18 PM IST
కారు, ట్రక్కు ఢీకొని ఏడుగురు మృతి, ఐదుగురికి గాయాలు
Representational image

బికనేర్: కారు, ట్రక్కు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతిచెందిన వారిలో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు  రాజస్తాన్‌లోని బికనేర్‌కు సమీపంలోని దెష్నోక్ వద్ద 49వ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారు కూడా ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు జిల్లా కలెక్టర్ కుమార్ పాల్ గౌతం తెలిపారు. 

మృతుల్లో కారులో ప్రయాణిస్తున్న వారి సంఖ్యే అధికంగా ఉంది. ఎదురుగా వేగంగా వచ్చిన ట్రక్కు కారును బలంగా ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు
బికనేర్ పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారి పరిస్థితి విషమంగానే ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని పోలీసులు భావిస్తున్నారు.