Demonetization: సరిగ్గా ఏడేళ్ల క్రితం. అంటే నవంబర్ 8 వతేదీ 2016వ సంవత్సరం. రాత్రి 8 గంటల సమయం. అంతా ఎవరి పనుల్లోవారు నిమగ్నమైన సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన ఒక్కసారిగా కలకలం రేపింది. అంతా గందరగోళం. ఏమౌతుందోననే ఆందోళన. ప్రతి ఒక్కర్నీ ప్రభావితం చేసిన వ్యాఖ్యలు. ఈ ప్రకటన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే చర్చ మరోవైపు.
ఏడేళ్ల క్రితం ప్రధాని మోదీ చేసిన ప్రకటన డీమానిటైజేషన్. అంటే నోట్ల రద్దు ప్రకటన. అప్పటి వరకూ చలామణీలో ఉన్న కొన్ని నోట్లను అకస్మాత్తుగా రద్దు చేస్తున్నట్టు చేసిన ప్రకటన. అదే రోజు అర్ధరాత్రి 8 గంటల్నించి దేశంలో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నామంటూ ప్రకటించి అందర్నీ ఉలిక్కిపడేలా చేశారు. అదే సమయంలో కొత్త 500 నోటును, సరికొత్తగా 2000 నోటును ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. పాత 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు ఇకపై చెల్లని కాగితాలే. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా అందర్నీ ఆందోళనకు గురి చేసింది. నోట్ల మార్పిడికి గడువిచ్చారు. అది కూడా పరిమితంగానే. రోజుకు కొంతమొత్తమే మార్చుకునేందుకు వీలుంటుంది. దాంతో దేశవ్యాప్తంగా బ్యాంకుల వద్ద భారీ క్యూలు దర్శనమిచ్చాయి. అర్ధరాత్రి నుంచే బ్యాంకుల వద్ద పడిగాపులు కాసిన పరిస్థితి. క్యూ లైన్లలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ప్రకటనపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి.
బ్లాక్ కరెన్సీని బయటకు తీసేందుకు ఈ నోట్ల రద్దు ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా ఫలితాలు అందుకు విరుద్ధంగా కన్పించాయి. రద్దయిన నోట్లలో నోట్ల మార్పిడి ద్వారా దాదాపు 98 శాతానికి పైగా వెనక్కి చేరిపోయాయి. నకిలీ నోట్లను అరికట్టేందుకు మాత్రం ఈ ప్రక్రియ కొంతకాలం ఉపయోగపడింది. వేయి రూపాయల నకిలీ నోటు చాలా పెద్దమొత్తంలో చలామణీ అయ్యేది.
మోదీ నోట్ల రద్దు ప్రకటన తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మహాత్మా గాంధీ సిరీస్ నోట్స్‌గా 500, 2000 నోట్లను ప్రవేశపెట్టింది. దేశంలో తొలిసారిగా పింక్ కలర్‌లో 2000 రూపాయల ప్రవేశించింది. పెద్ద పెద్ద లావాదేవీలకు ఉపయుక్తంగా ఉంటుందనే ఆలోచనతో ఈ నోటును ప్రవేశపెట్టారు. తిరిగి ఈ ఏడాది అంటే 2023 మే 19న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మరో సంచలన ప్రకటన చేశారు. 2000 రూపాయల నోటును చలామణీ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. నవంబర్ 8, 2016 డీమోనిటైజేషన్ తరువాత దేశ ప్రజలకు మరోసారి షాక్ ఇచ్చిన ప్రకటన ఇది. పాత 2000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు అక్టోబర్ 7 వరకూ గడువు ఇచ్చింది.
Also read: Post office scheme: 70 రూపాయల పెట్టుబడితో 3 లక్షలు.. అదిరిపోయే స్కీమ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook