Maharashtra: రనౌత్ వర్సెస్ రౌత్..సంజయ్ రౌత్ కు పార్టీలో కీలక బాధ్యతలు

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా...సుశాంత్ కేసులో సంచలన వ్యాఖ్యల చేస్తూ వివాదాలకు కేంద్రంగా మారిన కంగనా రనౌత్ తో ఆ నేత సై అంటే సై అన్నారు. బహుశా అందుకేనా ఆ పార్టీ అతనికి మరో కీలక బాధ్యతలు అప్పగించింది.

Last Updated : Sep 8, 2020, 08:46 PM IST
Maharashtra: రనౌత్ వర్సెస్ రౌత్..సంజయ్ రౌత్ కు పార్టీలో కీలక బాధ్యతలు

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ( Bollywood fire brand ) గా...సుశాంత్ ( Sushant ) కేసులో సంచలన వ్యాఖ్యల చేస్తూ వివాదాలకు కేంద్రంగా మారిన కంగనా రనౌత్ తో ఆ నేత సై అంటే సై అన్నారు. బహుశా అందుకేనా ఆ పార్టీ అతనికి మరో కీలక బాధ్యతలు అప్పగించింది.

శివసేన పార్టీ ( Shiv sena party ) పేరు చెప్పగానే...ఉద్ధవ్ థాకరే, ఆదిత్య థాకరే అనంతరం గుర్తొచ్చే కీలకనేత సంజయ్ రౌత్ ( Sanjay raut ). శివసేన పార్టీ నుంచి ఎంపీగా ఉన్న సంజయ్ రౌత్ వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలకు కేంద్రబిందువుగా ఉంటారెప్పుడూ. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ( Kangana ranaut ) తో సంజయ్ రౌత్ కు వివాదం తారాస్థాయికి చేరుకుంది. సై అంటే సై అనుకునే స్థాయికి వెళ్లారు. ముంబైను పీవోకేతో పాల్చిన కంగనా రనౌత్ పై సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ముంబైలో అడుగుపెట్టవద్దని కూడా హెచ్చరించారు. ఇప్పుడు సంజయ్ రౌత్ ను ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధిగా నియమిస్తూ మరింత కీలకమైన బాధ్యతల్ని అప్పగించింది. 

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు ( Sushant singh rajput case ) లో ముంబై పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని కంగనా అసహనం వ్యక్తం చేయడంతో ఈ వివాదం మొదలైంది. కంగనాపై అభ్యంతరకర వ్యాఖ్యల్ని ఉపసంహరించుకునేందుకు సంజయ్ రౌత్ సుముఖత చూపకపోయినా...పదాలు మెరుగ్గా ఉంటే బాగుండేదని మాత్రం అంగీకరించిన పరిస్థితి ఉంది. Also read: Anand Mahindra: మరింతగా భయపెట్టకండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x