‘మోదీజీ 21 రోజులు చాలన్నారు.. 110 రోజులైంది’

మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామం 18 రోజుల్లో ముగిసిందని, అదే తీరుగా ప్రస్తుతం 21 రోజుల్లో లాక్‌డౌన్ ద్వారా కరోనా లాంటి మహమ్మారిపై విజయం సాధిస్తామని ప్రధాని మోదీ చెప్పారని... కానీ వంద రోజులు గడిచినా ఏం సాధించారని శివసేన పార్టీ (Shiv Sena slams Centre) విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.

Last Updated : Jul 7, 2020, 03:42 PM IST
‘మోదీజీ 21 రోజులు చాలన్నారు.. 110 రోజులైంది’

ముంబై: దేశంలో కరోనా కేసులు (COVID19 In India) విపరీతంగా పెరిగిపోతున్నాయని, వైరస్ మహమ్మారిని అరికట్టడంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యాయని శివసేన పార్టీ (Shiv Sena) విమర్శంచింది. తమ పార్టీ పేపర్ సామ్నాలో కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించింది. కేవలం 21 రోజుల్లో కరోనా వైరస్‌ను రూపుమాపుతామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), కేంద్ర ప్రభుత్వం 100 రోజులు పూర్తయినా ఏం చేయలేకపోయారని పేర్కొంది. భార‌త్‌లో 7ల‌క్షలు దాటిన కరోనా కేసులు

‘కురుక్షేత్ర యుద్ధం 18 రోజుల్లో ముగిసిపోయింది. కోవిడ్19 మహమ్మారిపై మన యుద్ధం 21రోజుల్లో ముగిసి విజయం సాధిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. కానీ 100 రోజులు గడిచి, ప్రస్తుతం దేశంలో విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనాపై పోరాటం చేసిన వాళ్లే అలసిపోయారంటూ’ సామ్నాలో ఇచ్చిన కాలమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.  RGV సెక్సీ హీరోయిన్ Apsara Rani హాట్ ఫొటోలు వైరల్

మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధం కంటే కోవిడ్19 మహమ్మారి (Fight Against COVID19)పై పోరాటం క్లిష్టమైనదని, ఇప్పటివరకూ కనీసం కరోనా వ్యాక్సిన్ కూడా రాలేదని శివసేన పార్టీ గుర్తుచేసింది. 2021వరకు కరోనా వైరస్ ఉంటుందని వైద్యనిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోందని, ఇంకెంత కాలం లాక్‌డౌన్ కొనసాగిస్తారని ఎడిటోరియల్ ద్వారా కేంద్రాన్ని శివసేన ప్రశ్నించింది. కాగా, అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్రనే కావడం గమనార్హం. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos

Trending News