బీజేపిది మైనార్టీ సర్కార్.. 162 మంది ఎమ్మెల్యేలు మావైపే : శివసేన

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కోల్పోయిన శివ సేన.. ఇకపై కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తోంది. అందుకోసం ఓవైపు సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తూనే.. మరోపైవు తన ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది.

Last Updated : Nov 25, 2019, 02:40 PM IST
బీజేపిది మైనార్టీ సర్కార్.. 162 మంది ఎమ్మెల్యేలు మావైపే : శివసేన

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కోల్పోయిన శివ సేన.. ఇకపై కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తోంది. అందుకోసం ఓవైపు సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తూనే.. మరోపైవు తన ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ప్రస్తుతం శివ సేన ఎమ్మెల్యేలు అందరికీ ముంబైలోని లలిత్ హోటల్లో బస ఏర్పాటు చేయగా నేడు వారిని అక్కడి నుంచి మరో హోటల్‌కి మకాం మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చేస్తున్న తీవ్ర ప్రయత్నాల్లో భాగంగానే.. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ఏర్పడిన కొత్త ప్రభుత్వాన్ని మైనార్టీ ప్రభుత్వంగా అభివర్ణించిన శివ సేన నేత ఏక్‌నాథ్ షిండే.. సదరు మైనార్టీ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

ఏక్‌నాథ్ షిండే తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ''తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పేర్కొంటూ గవర్నర్‌కి లేఖ ఇచ్చాం. ఎటొచ్చీ ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎంత మెజార్టీ ఉందనేదానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కనుక నవంబర్ 23న ఏర్పడిన మైనార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేసి.. మెజార్టీ ఎక్కువ ఉన్న వారికి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం'' అని అన్నారు. ఇదివరకు ఏర్పడిన మైనార్టీ ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకోలేరని ఆరోపించిన ఏక్‌నాథ్ షిండే.. సదరు ప్రభుత్వం రాజీనామా చేసి పక్కకు తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

Trending News