GST on mobile phones: స్మార్ట్ ఫోన్ ధరలపై GST పిడుగు

స్మార్ట్ ఫోన్ ధరలు (Smart phones prices) భారీగా పెరగనున్నాయి. అందుకు కారణం స్మార్ట్ ఫోన్స్‌తో పాటు కొన్ని విడిభాగాలపై ప్రస్తుతం ఉన్న 12% జీఎస్టీని 18 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ (39th GST Council meet) నిర్ణయం తీసుకోవడమే.

Last Updated : Mar 14, 2020, 07:57 PM IST
GST on mobile phones: స్మార్ట్ ఫోన్ ధరలపై GST పిడుగు

న్యూ ఢిల్లీ: స్మార్ట్ ఫోన్ ధరలు (Smart phones prices) భారీగా పెరగనున్నాయి. అందుకు కారణం స్మార్ట్ ఫోన్స్‌తో పాటు కొన్ని విడిభాగాలపై ప్రస్తుతం ఉన్న 12% జీఎస్టీని 18 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ (GST Council) నిర్ణయం తీసుకోవడమే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో నేడు ఢిల్లీలో జరిగిన 39వ జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొబైల్ ఫోన్ ధరలపై వస్తు సేవల పన్ను పెంపు కూడా అందులో ఒకటి. ఇంకొన్ని వస్తుసేవలపై పన్ను రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. 39వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ (39th GST Council meet)లో తీసుకున్న నిర్ణయాలన్నీ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయని కేంద్రం స్పష్టంచేసింది.

చైనాలో కరోనా వైరస్ విజృంభించడంతో రానున్న కాలంలో భారత్‌లో స్మార్ట్ ఫోన్స్, విద్యుత్ పరికరాల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. చైనా నుంచే ఎక్కువ శాతం స్మార్ట్ ఫోన్స్, వాటి విడిభాగాలు, విద్యుత్ ఉపకరణాల విడిభాగాలు దిగుమతి అవుతుండటమే అందుకు కారణం. కానీ అంతకంటే ముందుగానే మొబైల్ ఫోన్లపై జీఎస్టీ బాదుడు రూపంలో ప్రభావం పడటంతో ఏప్రిల్ తర్వాత స్మార్ట్ ఫోన్ ధరలు పెరిగే పరిస్థితి ఏర్పడింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News