Rain Alert: దేశవ్యాప్తంగా నైరుతి గాలులు బలంగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తరాధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు దంచికొడుతున్నాడు. ఏపీ, తెలంగాణలోని చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర ద్వీపకల్ప భారతదేశమంతంటా ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది.
దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకున్న ఉన్న వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు ఆవర్తనం వ్యాపించింది. దీనికి తోడు రుతుపవన ద్రోణి సైతం కేంద్రీకృతమైంది. వీటి ప్రభావంతో రాగల మూడురోజులపాటు తెలంగాణలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయని తెలిపింది.
ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ఏకధాటిగా వానలు పడుతున్నాయి. రాగల మూడు రోజులపాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంట పెనుగాలులు వీస్తాయని..మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
Also read:Marriages of Politicians: రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న రాజకీయ నాయకులు వీరే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook