Marriages of Politicians: రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న రాజకీయ నాయకులు వీరే..!

Marriages of Politicians: పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ రెండోసారి ఇంటివాడు అయ్యారు. ఇవాళ అట్టహాసంగా జరిగిన వేడుకల్లో మాన్, గురుప్రీత్ కౌర్ ఒక్కటైయ్యారు. ప్రముఖ రాజకీయ నాయకులు రెండు, మూడు వివాహాలు చేసుకోవడం కొత్తేమి కాదు. గతంలోనూ చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడా జాబితా చూద్దాం..

Written by - Alla Swamy | Last Updated : Jul 7, 2022, 03:50 PM IST
  • రెండో వివాహం చేసుకున్న పంజాబ్ సీఎం
  • అట్టహాసంగా పెళ్లి వేడుక
  • రెండు పెళ్లిళ్లు చేసుకున్న పలువురు ప్రముఖులు
Marriages of Politicians: రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న రాజకీయ నాయకులు వీరే..!

Marriages of Politicians: పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ రెండో వివాహానికి సంబంధించిన విజువల్స్, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వృత్తిరిత్యా డాక్టర్‌ అయిన గురుప్రీత్‌ కౌర్‌ను ఆయన పెళ్లాడారు. ఆరేళ్ల కింద మొదటి భార్యను నుంచి మాన్ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన మొదటి భార్య, పిల్లలు అమెరికాలో నివసిస్తున్నారు. ఇటీవల మాన్ పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన పిల్లలలు సైతం పాల్గొన్నారు. మాన్ తల్లి, సోదరి మేరకు గురుప్రీత్ కౌర్‌ను మాన్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. 

మనోజ్ తివారీ..

సినీ నటుడు, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ కూడా రెండో పెళ్లి చేసుకున్నారు. 2020లో భోజ్‌పురి గాయని సురభి తివారీతో జీవితాన్ని పంచుకున్నారు. 

కపిల్ సిబల్‌..

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత కపిల్ సిబల్‌ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన మొదటి భార్య నీనా సిబల్‌..క్యాన్సర్‌తో మృతి చెందారు. ఆ తర్వాత సామాజిక కార్యకర్త ప్రమీలను పెళ్లి చేసుకున్నారు. ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సిబల్‌..ఎస్పీ ద్వారా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 

శశిథరూర్‌..

2010 ఆగస్టు 22న కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌ రెండోసారి పెళ్లిపీటలు ఎక్కారు. కేరళలోని ఎలవంచెలరిలో వ్యాపారవేత్త సునంద పుష్కర్‌ను పెళ్లి చేసుకున్నారు. 

రామ్‌ విలాస్ పాశ్వాన్‌..

కేంద్రమంత్రి, బీజేపీ రామ్‌ విలాస్ పాశ్వాన్‌ 1960లో రాజకుమారి దేవిని వివాహం చేసుకున్నారు. కొన్ని కారణాలతో 1981లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1982లో రీనా శర్మ అనే ఎయిర్ హోస్టెస్‌తో రెండోసారి జీవితం పంచుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుడు చిరాగ్ కుమార్ పాశ్వాన్ సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా రాణిస్తున్నారు. 

దిగ్విజయ్ సింగ్..

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం తమిళనాడులో టీవీ జర్నలిస్ట్ అమృతా రాయ్‌తో రెండో వివాహం చేసుకున్నారు. 

ఎన్టీఆర్..

తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు రాజకీయ నాయకులు రెండు వివాహాలు చేసుకున్న వారు ఉన్నారు. తెలుగు జాతిని ప్రపంచానికి తెలిసేలా చేసిన ఉమ్మడి ఏపీ సీఎం, సినీ నటుడు ఎన్టీఆర్ సైతం రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1942లో బసవతారకంతో జీవితం పంచుకున్నారు. ఐతే ఆమె 1985లో మృతి చెందింది. దీంతో 1993లో లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ రెండో వివాహం చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్‌..

ఆ తర్వాత జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ మూడుసార్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదట 1997లో నందిని పెళ్లి చేసుకోగా..2007లో విడిపోయారు. ఆ తర్వాత 2009లో రేణు దేశాయ్‌ను వివాహం చేసుకోగా..2012లో విడాకులు తీసుకున్నారు. 2013లో లెజ్నెవాను మూడో పెళ్లి చేసుకున్నారు. 

Also read:Cooking Oil: దేశంలో దిగొస్తున్న వంట నూనెల ధరలు..తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు..!

Also read:Asia Cup-2022: ఈసారి టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్..భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ అప్పుడే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య,     ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook

Trending News