Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు, ఉపరితల ఆవర్తనంతో విస్తారంగా వానలు పడుతున్నాయి. రాగల మూడురోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈస్ట్ వెస్ట్ షీర్ జోన్ వెంబడి సగటు సముద్రం మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఉత్తర ద్వీపకల్ప భారతమంతటా కేంద్రీకృతమైంది. ఇటు నిన్న వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న ఆవర్తనం ఇవాళ ఉత్తర ఒడిశాను ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.
మరోవైపు నైరుతి రుతు పవనాలు సైతం బలంగా ఉన్నాయి. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులపాటు వర్షలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి. ఎల్లుండి మరిన్ని భారీ వర్షాలు కురవనున్నారు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇటు ఏపీలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి రుతు పవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు పడుతున్నాయి. మరో మూడు రోజులపాటు వాతావరణం ఇలాగే ఉండనుంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ, అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంట పెను గాలులు వీస్తాయని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు కురుస్తుండటంతో రైతులంతా పొలం పనుల్లో నిమగ్నమవుతున్నాయి. దుక్కి దున్ని విత్తనాలు నాటుతున్నారు.
Also read:ENG vs IND 5th Test: చెత్త బౌలింగ్.. టీమిండియా బౌలర్లపై సెహ్వాగ్ ఫైర్!
Also read:KCR U TURN: పాలిటిక్స్ వదిలేసి పాలనపై ఫోకస్! రూట్ మార్చిన కేసీఆర్.. పీకే నివేదికే కారణమా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook