Ayodhya: రాముని ప్రత్యేక వస్త్రాలు సిద్ధం

అయోధ్య రాముని ఆలయ నిర్మాణ శంకుస్థాపనకు సర్వం సిద్ధమవుతోంది. రామ్ లల్లా కోసం ఇప్పటికే ప్రత్యేక వస్త్రాలు సిద్ధమయ్యాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5 ముహూర్తానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.

Last Updated : Aug 2, 2020, 07:04 PM IST
Ayodhya: రాముని ప్రత్యేక వస్త్రాలు సిద్ధం

అయోధ్య రాముని ఆలయ నిర్మాణ శంకుస్థాపనకు సర్వం సిద్ధమవుతోంది. రామ్‌లల్లా కోసం ఇప్పటికే ప్రత్యేక వస్త్రాలు సిద్ధమయ్యాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5 ముహూర్తానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.

కోర్టు అడ్డంకులు తొలగి..శంకుస్థాపనకు సిద్ధమవుతున్నఅయోధ్య రాముని ఆలయానికి మరికాస్త వ్యవధి మాత్రమే మిగిలింది. సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5 న శంకుస్థాపనకు ముహూర్తం సిద్ధమైంది. రామజన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అయోధ్యలో కొలువుదీరనున్న రాముని కోసం ప్రత్యేక వస్త్రాలు కూడా సిద్ధమయ్యాయి. రామ్‌లల్లా ఆలయ ప్రధాన అర్చకులైన మహంత్ సత్యేంద్రదాస్ కు ఈ ప్రత్యేక వస్త్రాల్నిరామ్ దళ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు కల్కిరామ్ అందించారు. కీలకమైన ఈ ఘట్టం పూర్తవడంతో ఇక మరి కొన్ని గంటల వ్యవధిలో అంటే ఆగస్టు 5న రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన అత్యంత ఘనంగా జరగనుంది. రేపట్నించి ఆగస్టు 5 వరకూ ఈ ప్రత్యేక వస్త్రాలతో రామ్‌లల్లా అలంకరణ జరుగుతుందని మహంత్ సత్యేంద్రదాస్ తెలిపారు. పసుపు, ఆకుపచ్చ లేదా కాషాయం రంగు వస్త్రాల్ని వినియోగించవచ్చని ఆయన అన్నారు. Also read: Train Journey: కోవిడ్ 19 వైరస్ ముప్పు ఎంతవరకు?

 

Trending News