చిన్నప్పుడు ఆడుకున్న పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. చుక్ చుక్ రైలు వస్తోంది..దూరం దూరం జరగండి అంటూ. ఇప్పుడు దూరం జరగడం కాదు కదా..దూరం వెళ్లిపోమంటున్నారు. కరోనా సంక్రమణ నేపధ్యంలో రైలు ప్రమాదమే బహు ప్రమాదకరమని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
కోవిడ్ 19 వైరస్ మహమ్మారి రోజురోజుకూ విజృంభించడమే కానీ తగ్గుముఖం పట్టే పరిస్థితులు కన్పించడం లేదు. మరోవైపు ఇంచుమించు ప్రపంచమంతా లాక్ డౌన్ ప్రక్రియ ముగిసి..అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇండియాలో ఇప్పుడు అన్ లాక్ 3 ప్రారంభమైంది. ఓ నెల రోజుల్నించి దేశవ్యాప్తంగా పరిమితమైన సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. సరిగ్గా నెల నుంచే కేసుల వేగం కూడా భారీగా పెరిగిపోయింది. అందుకే రైలు ప్రమాదంతో భద్రంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. రైలు ప్రయాణంలో కరోనా వైరస్ సోకే ముప్పు ఎంత వరకుందో అనే విషయంపై శాస్త్రీయంగా అంచనాలు వేశారు. చైనాకు చెందిన చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్శన్ తో పాటు యూకేకు చెందిన కొంతమంది నిపుణులు చేసిన అధ్యయనం ఇదే చెబుతోంది.
రైలు ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణీకుల మధ్య ఉన్న దూరం, ఎంతసేపు కలిసి ప్రయాణం చేస్తారు అనే విషయాన్ని పరిగణలో తీసుకుని సర్వే నిర్వహించారు. రైలు ప్రయాణీకులు ఎంత దగ్గరగా కూర్చుని ఉన్నారనే విషయంపై ఆధారపడి వైరస్ వ్యాప్తి 0.32 శాతంగా ఉంటుంది. కోవిడ్ రోగి పక్కనే ఉంటే ఆ వైరస్ వ్యాప్తి 3.5 శాతంగా ఉంటుంది. అటు రోగితో కలిసి ఒకే వరుసలో కూర్చుని ప్రయాణం చేస్తే మాత్రం 1.4 శాతం అవకాశాలుంటాయి. ఒక రోగి ఖాళీ చేసిన స్థలంలో వచ్చి కూర్చుంటే 0.75 శాతంగా ఉుంటుంది. రైలు భోగిలో ఉండే మొత్తం ప్రయాణీకుల సంఖ్యను బట్టి ...ప్రయాణించే సమయాన్ని బట్టి ప్రతి గంటకు వైరస్ వ్యాపించే ముప్పు 1.3 శాతం పెరుగుతుంటుంది.
గంటసేపు ప్రయాణానికి ప్రతి ఇద్దరు ప్రయాణీకులకు మధ్య దూరం మీటర్ కంటే ఎక్కువ ఉండాలి. రెండు గంటల ప్రయాణమైతే 2.5 కిలోమీటర్లుండాలి. సో ఓవరాల్ గా రైలు ప్రయాణం రిస్క్ తో కూడుకున్నదే ఈ సమయంలో. Also read: Covid19: కేంద్రమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్