Sravana Kamika Ekadashi 2022: శ్రావణ మాసం కామికా ఏకాదశి ఎప్పుడు? వ్రత ప్రయోజనాలు ఏంటి?

Kamika Ekadashi 2022: శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు. ఈసారి కామిక ఏకాదశి రోజున 3 శుభ యోగాలు ఏర్పడుతున్నాయి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 18, 2022, 04:42 PM IST
  • జూలై 24న కామిక ఏకాదశి
  • ఈ రోజున విష్ణువుతోపాటు శివుడిని పూజిస్తారు
Sravana Kamika Ekadashi 2022: శ్రావణ మాసం కామికా ఏకాదశి ఎప్పుడు? వ్రత ప్రయోజనాలు ఏంటి?

Sravana Kamika Ekadashi 2022 Date: శ్రావణ మాసం మెుదలైంది. శ్రావణ మాసం మెుదటి ఏకాదశినే  కామిక లేదా కామికా ఏకాదశి అని అంటారు. ఈ మాసంలో శివుడిని పూజిస్తే...ఏకాదశి రోజున విష్ణువును పూజిస్తారు. త్వరలో శ్రావణ మెుదటి ఏకాదశి రానుంది. ఈ రోజున వ్రతాన్ని చేయడం ద్వారా శివుడు, విష్ణువు ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాకుండా మీ పాపాలు నశిస్తాయి. ఈ ఏడాది కామికా ఏకాదశి 2022 (Kamika Ekadashi 2022) వ్రతాన్ని జూలై 24న పాటిస్తున్నారు. 

ముహూర్తం
పంచాంగం ప్రకారం శ్రావణ కృష్ణ పక్ష ఏకాదశి తిథి జూలై 23, శనివారం ఉదయం 11.27 గంటలకు ప్రారంభమై.. జూలై 24 ఆదివారం మధ్యాహ్నం 01.45 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ఆధారంగా.. జూలై 24న కామికా ఏకాదశి వ్రతం చేస్తారు. 

శుభ యోగం 
కామిక ఏకాదశి నాడు అంటే జూలై 24 ఉదయం నుండి వృద్ధి యోగం ప్రారంభమై.. మధ్యాహ్నాం 02.02 నిమిషాల వరకు ఉంటుంది. ఆ తర్వాత ధృవయోగం మెుదలవుతుంది. ఈ రోజున ద్విపుష్కర యోగం కూడా నిర్వహిస్తున్నారు. ద్విపుష్కర యోగం జూలై 24 రాత్రి 10 గంటల నుండి జూలై 25 ఉదయం 05:38 వరకు ఉంటుంది. అంతేకాకుండా రోహిణి నక్షత్రం కామిక ఏకాదశి నాడు రాత్రి 10 గంటల వరకు ఉండి.. ఆ తర్వాత మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఉదయం నుండే వృద్ధి యోగం మెుదలవుతుంది కాబట్టి ప్రజలు మార్నింగ్ నుండి విష్ణువును పూజించాలి.

పారణ సమయం
కామికా ఏకాదశి 2022 వ్రత పారణ సమయం జూలై 25 ఉదయం 05:38 నుండి 08:22 వరకు చేయవచ్చు. ద్వాదశి తిథి జూలై 25 సాయంత్రం 04:15 గంటలకు ముగుస్తుంది.

వ్రత ప్రయోజనాలు 
కామికా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల అన్ని తీర్థాల్లో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. అది పాపాలను నశింపజేసి బ్రహ్మ హత్య పాతకాన్ని పోగొడుతుంది. విష్ణువు అనుగ్రహంతో మరణానంతరం మోక్షం లభిస్తుంది.

Also Read: Gajakesari yoga: తొలి శ్రావణ సోమవారం నాడే గజకేసరి యోగం.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలు.. 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News