బ్రేకింగ్: టిక్ టాక్ యాప్‌ తాత్కాలిక నిషేధంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

టిక్ టాక్ యాప్‌ తాత్కాలిక నిషేధంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Last Updated : Apr 22, 2019, 08:24 PM IST
బ్రేకింగ్: టిక్ టాక్ యాప్‌ తాత్కాలిక నిషేధంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: చైనాకు చెందిన టిక్ టాక్ మొబైల్ యాప్‌పై భారత సుప్రీం కోర్టు ఇటీవలే తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గూగుల్ సైతం టిక్ టాక్ మొబైల్ యాప్ ను తమ ప్లే స్టోర్ లోంచి తొలగించింది. అయితే, ఈ వ్యవహారంలో తాజాగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏప్రిల్ 24వ తేదీలోగా మద్రాస్ హై కోర్టు టిక్ టాక్ యాప్‌పై నిషేధం విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే, ఇప్పటివరకు ఆ మొబైల్ యాప్ పై వున్న తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేయడం జరుగుతుందని సుప్రీం కోర్టు నేడు తేల్చిచెప్పింది. 

సుప్రీం కోర్టు ఆదేశాలతో మద్రాస్ హై కోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సుప్రీం ఆదేశాలకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

Trending News