Swiggy Teams UP With IRCTC For Food Delivery: లాంగ్ జర్నీలు చేసేటప్పుడు కొందరు మంచి రుచికరమైన భోజనం చేయాలని అనుకుంటారు. కానీ రైల్వే స్టేషన్ లలో దొరికే ఫుడ్ నచ్చక, ఏదో స్నాక్స్ తో ఆ పూట గడిపేస్తుంటారు. ఇలాంటి వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట ఇంట్లో ఎలాగైతే మనకు నచ్చిన ఫుడ్ ను తెప్పించుకుని తింటామో.. అలాగే రైళ్లలో కూడా మనకు కావాల్సిన ఫుడ్ ను ఆర్డర్ పెట్టోచ్చు.. ఈ మేరకు సీఆర్టీసీ, స్విగ్గీల మధ్య మంగళవారం ఒప్పందం జరిగింది. మార్చి 12 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
తొలుత ఈ సేవలు కొన్ని స్టేషన్ లలో మాత్రమే ప్రారంభిస్తున్నట్లు సమాచారం. విశాఖ పట్నం, విజయవాడ, భువనేశ్వర్, బెంగళూరులలో ఈ స్విగ్గీ సర్వీసు సేవలు ప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్కడ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఐఆర్టీసీ యాప్ ను ఉపయోగించాలి. అందులో పీఎన్ఆర్ పీఎన్ఆర్ నంబర్ ను ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత కావాల్సిన ఫుడ్ ను నచ్చిన స్టేషన్ లో పొందవచ్చన్నమాట. ఈ కొత్త ఒప్పందంతో రైల్వే ప్రయాణికులు మరింతగా ఎంజాయ్ చేస్తారని ఐఆర్టీసీ మెనెజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రయాణికులనుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని కూడా స్విగ్గీ ఫుడ్ డెలీవరీ సంస్థ సీఈఓ రోహిత్ కుమార్ పేర్కొన్నారు. కస్టమర్ల రెస్పాన్స్ ను బట్టి మరిన్ని రైల్వే స్టేషన్లకు ఈ సర్వీసులను విస్తరిస్తామని కూడా రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Read More: Shivatmika Rajasekhar: అందాల ఆరబోతలో హద్దులు దాటేసిన శివాత్మిక.. మరి ఈ రేంజ్ లోనా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook