Corona update: తమిళనాట 3 లక్షలు దాటిన కరోనా కేసులు

తమిళనాట ( Tamilnadu ) కరోనా ( Corona ) విజృంభణ ఆగడం లేదు. దేశంలో మహారాష్ట్రతో ( Maharashtra ) పాటు తమిళనాడులోనే కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 2 వేల 815కు చేరుకుంది.

Updated: Aug 10, 2020, 11:26 PM IST
Corona update: తమిళనాట 3 లక్షలు దాటిన కరోనా కేసులు

తమిళనాట ( Tamilnadu ) కరోనా ( Corona ) విజృంభణ ఆగడం లేదు. దేశంలో మహారాష్ట్రతో ( Maharashtra ) పాటు తమిళనాడులోనే కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 2 వేల 815కు చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 5 వేల 914 కేసులు నమోదైనట్టు తమిళనాడు ( Tamil nadu ) వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 2 లక్షల 44 వేల 675 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా...53 వేల 99 మంది చికిత్స పొందుతున్నారు. అటు మరణాలు కూడా పెద్దఎత్తున నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా 114 మంది మృతి చెందగా..మొత్తం సంఖ్య 5 వేల 41కు చేరుకుంది. ఓ వైపు కేసుల సంఖ్య పెరుగుతున్నా సరే...రికవరీ రేటు కూడా పెరుగుతుండటం ఊరట కల్గిస్తోంది.  దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులు అత్యధికంగా చేస్తున్నాయి. Also read: Covid-19: సెప్టెంబరు 30 వరకు రైళ్లు బంద్