బోధించే గురువే.. బాలకార్మికులను చేశాడు

ఒడిశా ప్రాంతంలోని మయూర్ బంజ్‌కు చెందిన థాకుర్ ముండా ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తన పొలంలో పని చేయించుకున్నందుకుగాను, స్కూలు పిల్లలకు ఓ ఉపాధ్యాయుడు 100 రూపాయలు ఇచ్చాడని విద్యార్థులు చెబుతున్నారు.

Last Updated : Nov 25, 2017, 03:41 PM IST
బోధించే గురువే.. బాలకార్మికులను చేశాడు

విద్యను బోధిస్తూ.. సర్వశిక్ష అభియాన్ అనే సూక్తికి న్యాయం చేసి.. అందరికీ చదువును చేరువ చేయాల్సిన గురువే.. ఆ బాలల పాలిట నియంతగా మారాడు. వారిని బాల కార్మికులుగా మార్చేశాడు. మూడు రోజుల పాటు తన పొలంలో పనిచేయించుకున్నాడు. ఒడిశా ప్రాంతంలోని మయూర్ బంజ్‌కు చెందిన థాకుర్ ముండా ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తన పొలంలో పని చేయించుకున్నందుకు గాను, వారికి 100 రూపాయలు కూడా ఇచ్చాడని విద్యార్థులు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన తర్వాత బాల కార్మిక వ్యవస్థ ఏ రూపంలోనూ ఉండటానికి వీల్లేదని... ఆర్థిక కారణాల వల్ల ఏ బిడ్డా బడి వెలుపల ఉండరాదని మన దేశంలో విద్యా హక్కు చట్టం స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో ఇలాంటి గురువులు బాలల హక్కులను హరించడం ఎంత వరకు సబబు అని పలువురు విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

 

Trending News