Rafale: యుద్ధవిమానాల రాకలో అతని పాత్ర కీలకం..తొలి పైలట్ కూడా

ప్రతిష్టాత్మక రఫేల్ యుద్ధవిమానాల రాకపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఫ్రాన్స్ నుంచి యుద్ధవిమానాల రాకలో గానీ...తొలి పైలట్ గా గానీ వ్యవహరించింది అతనే. అందుకే ఇప్పుడతను వార్తల్లో నిలుస్తున్నాడు.

Last Updated : Jul 29, 2020, 09:03 AM IST
Rafale: యుద్ధవిమానాల రాకలో అతని పాత్ర కీలకం..తొలి పైలట్ కూడా

ప్రతిష్టాత్మక రఫేల్ యుద్ధవిమానాల ( Rafale jet flights ) రాకపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఫ్రాన్స్ నుంచి యుద్ధవిమానాల రాకలో గానీ...తొలి పైలట్ గా గానీ వ్యవహరించింది అతనే. అందుకే ఇప్పుడతను వార్తల్లో నిలుస్తున్నాడు.

ఇండియా- ఫ్రాన్స్ ( India-france ) ల మధ్య రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందానికి నాలుగేళ్ల తరువాత తొలి బ్యాచ్ జెట్ విమానాలు ఇండియాలో ల్యాండ్ అవుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ( IAF ) సామర్ధ్యాన్ని మరింతగా బలోపేతం చేయనున్నాయి. ఈ నేపధ్యంలో ఆ వ్యక్తి ప్రస్తావన ఇప్పుడు ప్రధానంగా విన్పిస్తోంది. అతనే ఎయిర్ కమ్మోడోర్ హిలాల్ అహ్మద్ రాథర్ ( Air Commodore Hilal Ahmed ). Also read: Rafale fighter Jets కీలక తరుణంలో భారత్‌కు రఫేల్ యుద్ధ విమానాలు

ప్రస్తుతం ఫ్రాన్స్ దేశానికి ఎటాచ్ అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వ్యక్తి. రఫేల్ జెట్స్ ఇండియాకు త్వరగా రావడంలో కీలకపాత్ర పోషించింది హిలాల్ అహ్మదే ( Hilal Ahmed ). అంతేకాకుండా రఫేల్ జెట్స్ ను భారతీయ వాతావరణానికి, అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దింది కూడా ఇతనే. రఫేల్ తొలి యుద్ధవిమానాన్ని నడుపుతున్న తొలి భారతీయ పైలట్ కూడా ఇతనే. Also read: Rafale: మరి కొన్ని గంటల్లో భారత్ కు రాఫెల్, అంబాలాలో ఆంక్షలు

భారతీయ వైమానిక దళ అధికారిగా మిరేజ్ 2000 ( Mirage 2000 ), మిగ్ 21 ( MIG 21 ), కిరణ్ యుద్ధ విమానాలపై 3 వేల ఫ్లైయింగ్ అవర్స్ ను విజయవంతంగా, ప్రమాదం లేకుండా నడిపిన చరిత్ర హిలాల్ అహ్మద్ కు ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫ్లయింగ్ ఆఫీసర్ గా ఘనతను హిలాల్ దక్కించుకున్నారు. దక్షిణ కాశ్మీర్ అనంతనాగ్ కు చెందిన హిలాల్ అహ్మద్  కెరీర్ లో వాయుసేన మెడల్, విశిష్ట సేవ మెడల్ పతకాల్ని సాధించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో స్వోర్డ్ ఆఫ్ హానర్ కూడా హిలాల్ అహ్మద్ గెల్చుకున్నారు. Also read: Rafale: దిగ్విజయంగా శిక్షణ పూర్తి చేసుకున్న పైలట్లు

Trending News