భారీగా పెరిగిన బంగారం ధరలు, కొండెక్కిన వెండి

జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయి (Gold Rates Today).

Written by - Shankar Dukanam | Last Updated : Apr 24, 2020, 08:45 AM IST
భారీగా పెరిగిన బంగారం ధరలు, కొండెక్కిన వెండి

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు పుంజుకోగా, వెండి ధరలు సైతం భారీగా పెరిగాయి. శుక్రవారం ధరలు భారీగా పెరగడంతో మార్కె‌ట్‌కు జోష్ వచ్చింది. జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే. బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటే ఎన్ని లాభాలో!

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ మార్కెట్లలో నేడు తులం (10 గ్రాముల) బంగారం ధర రూ.520 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.45,300కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.610 పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,660కి జంప్ అయింది.

నేడు ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు ఓ మోస్తరుగా పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.600 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.45,500కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.610 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర  రూ.42,770 వద్ద ట్రేడ్ అవుతోంది. Photos: లేటు వయసులో బికినీ అందాలు

నేడు బంగారం ధరలు ఓ మోస్తరుగా పెరగగా, వెండి ధర భారీగా పెరిగింది. 1కేజీ వెండిపై రూ.1,010 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.42,420కి చేరుకుంది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Trending News