Blue moon: ఇవాళే బ్లూమూన్..తిరిగి 2039 లోనే ఆవిష్కృతం

ఆకాశంలో జరిగే అరుదైన అద్భుతానికి ఇవాళ వేదిక కానుంది. జాబిల్లి నిండుగా దర్శనం ఇవ్వనుంది. అయితే నీలిరంగులో. ఇవాళ్టి బ్లూమూన్ లేదా హంటర్ మూన్ విశేషమేంటంటే..

Last Updated : Oct 31, 2020, 03:28 PM IST
Blue moon: ఇవాళే బ్లూమూన్..తిరిగి 2039 లోనే ఆవిష్కృతం

ఆకాశంలో జరిగే అరుదైన అద్భుతానికి ఇవాళ వేదిక కానుంది. జాబిల్లి నిండుగా ( Full moon day ) దర్శనం ఇవ్వనుంది. అయితే నీలిరంగులో. ఇవాళ్టి బ్లూమూన్ ( Blue moon ) లేదా హంటర్ మూన్ విశేషమేంటంటే..

పౌర్ణమి గానీ, అమావాస్య గానీ నెలలో ఒక్కసారే కన్పిస్తాయి. రెండుసార్లు వస్తే కచ్చితంగా విశేషమే. 2020 అక్టోబర్ నెలలో నిజంగా అద్భుతం జరగనుంది. అక్టోబర్ 31న ( Blue moon on October 31 ) అంటే ఇవాళ చందమామ నిండుగా సంపూర్ణంగా కన్పించనున్నాడు. ప్రతి పౌర్ణమికి కన్పించేదే కదా అనుకుంటున్నారా.. నిజమే కానీ ఈ నెలలో ఇది రెండోసారి. ఒకే నెలలో రెండు పౌర్ణమిలు ఏర్పడితే  రెండవ పౌర్ణమిని బ్లూమూన్ అని..కొన్నిదేశాల్లో హంటర్ మూన్ అని పిలుస్తారు.

పూర్తి నీలం రంగులో ధగధగమెరుస్తూ కన్పిస్తుంది కాబట్టి బ్లూమూన్ అని పిలుస్తారు. అటు రాత్రివేళల్లో జంతువుల్ని  వేటాడటానికి ఈ పౌర్ణమి సహకరిస్తుంది కాబట్టి హంటర్ మూన్ ( Hunter moon ) అని పిలుస్తారు. ఇలా ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి ఏర్పడటం లేదా బ్లూమూన్ ఏర్పడటమనేది 2-3 ఏళ్లకోసారి మాత్రమే జరుగుతుంది. 2018లో బ్లూమూన్ ఏర్పడింది. తిరిగి ఇవాళ ఏర్పడబోతోంది. అయితే తిరిగి మళ్లీ ఏర్పడేది మాత్రం సుదీర్ఘకాలం తరువాతే.  2039లోనే మళ్లీ బ్లూమూన్ ఏర్పడుతుందని అంచనా. ఈ నేపధ్యంలో ఇవాళ్టి బ్లూమూన్ కు విశేష ప్రాధాన్యత ఏర్పడింది.

బ్లూమూన్ అనే పేరెలా ఎలా వ‌చ్చింద‌నే సందేహం చాలా మందిలో ఉంది. చంద్రుడు ఏడాదిలో 12 సార్లు పెద్ద సైజులో ద‌ర్శ‌నిమిస్తుంటాడు. ఈ క్రమంలో ప్రతి పౌర్ణమికి ఓ పేరు పెట్టడం ప్రారంభమైంది. నాసా ( NASA ) చెప్పినదాని ప్ర‌కారం 1883లో ఇండోనేషియాలోని క్రాకాటోవా అగ్ని ప‌ర్వ‌తం పేలి భారీ ఎత్తున వెలువ‌డిన బూడిద ఆకాశంలోకి చేరింది. తరువాత ఈ బూడిద క‌ణాలు చంద్రునిలోని ఎరుపు రంగును చెద‌ర‌గొట్టాయి. దాంతో చంద్రుడు నీలం రంగులో ద‌ర్శ‌న‌మిచ్చిందని..అందుకే ఇది అరుదైన ఘటన అని స్పష్టం చేసింది. అప్పట్నించి బ్లూమూన్ అనే పదం వాడుకలో వచ్చిందని తెలుస్తోంది. Also read: Bihar Assembly Election: వ్యాక్సిన్ ఉచితం సరైందే: ఈసీ

Trending News