కరోనా వైరస్ నుంచి ముప్పు ఇంకా తొలగనే లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరోవైపు ప్రాణాంతక క్యాట్ క్యూ వైరస్ ప్రమాదం భారత్ కు పొంచి ఉందని ఐసీఎంఆర్ హెచ్చరిస్తోంది.
కోవిడ్ 19 వ్యాక్సిన్ ( Covid 19 Vaccine ) కు భారతదేశం పూర్తిగా ప్రయత్నిస్తోంది. దేశీయ కంపెనీతో కలిసి పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ( Pune- National institute of virology ) అభివృద్ధి చేసిన కో వ్యాక్జిన్ ( Covaxin ) క్లినికల్ ట్రయల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రెండు ఫేజ్ ల క్లినికల్ ట్రయల్స్ కోసం 1125 శాంపిల్స్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి.
COVAXIN Controversy | కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు బారత్ సహా అన్ని అగ్రదేశాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ పరిస్థితుల్లో భారతదేశానికి చెందిన భారత్ బయోటెక్ సంస్థ, పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి అభివృద్ధి చేసిన బ్రాండ్ పేరు కోవ్యాక్జిన్. ఈ కంపెనీ వ్యాక్సిన్ ను ఆగస్టు 15 లోగా అందుబాటులో తీసుకొస్తామంటూ తేదీని ఫిక్స్ చేస్తూ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ ఓ లేఖ రాశారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు కోవిడ్ 19 ను అరికట్టేందుకు వ్యాక్సిన్ పై పరిశోధనలు వేగవంతమవుతున్నాయి. వ్యాక్సిన్ పరిశోధనలో క్లినికల్ ట్రయల్స్ అనేవి అత్యంత ప్రాధాన్యత కలవి. ఇవి విజయవంతమైతేనే వ్యాక్సిన్ మార్కెట్ లో అందుబాటులో వస్తుంది. ఇటీవల ఓ భారతదేశ కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు డీసీజీఐ సైతం అనుమతిచ్చింది. ఇందులో భాగంగా ఎంపికైన నిమ్స్ లో జూలై 7 నుంచి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.