Triple Talaq Bill : కాంగ్రెస్ వాకౌట్; లోక్ సభలో త్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం

త్రిపుల్ తలాక్ విషయంలో మోడీ సర్కార్ తన పంతం నెగ్గించుకుంది.

Last Updated : Dec 27, 2018, 07:34 PM IST
Triple Talaq Bill  : కాంగ్రెస్ వాకౌట్; లోక్ సభలో త్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం

లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్య చారిత్రకమైన ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్  ప్రసాద్ ఈ బిల్లును  ప్రవేశ పెట్టగా సభ్యులు దీన్ని ఆమోదించారు. ఈ బిల్లును 245 - 11 ఓట్ల తేడాతో  సభ ఆమెదించింది. బిల్లు ఆమోదానికి ముందు ట్రిపుల్ తలాక్ బిల్లులో సవరణలపై లోక్ సభలో ఓటింగ్ జరిగింది. ఈ బిల్లుపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సహా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన సవరణలు వీగిపోయాయి.

సెలక్ట్ కమిటీకి పంపాలన్న ఓవైసీ

అంతకు ముందు బిల్లుపై చర్చ సమయంలో సభలో గందరగోళం వాతావరణం నెలకొంది. కాంగ్రెస్‌ సహా ఇతర విపక్షాలు ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై చర్చకు అభ్యంతరం తెలిపాయి. బిల్లు ఏక పక్షమంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు సంధించాయి. ఈ బిల్లు కేవలం రాజకీయాల ప్రయోజనాల కోసం తప్పితే.. ముస్లిం సమాజానికి ఇది ఏమాత్రం ప్రయోజకరం కాదని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఈ బిల్లును ముస్లిం సమాజానికి చెందిన మహిళలందరూ వ్యతిరేకిస్తనున్నారని ఓవైసీ పేర్కొన్నారు. ఈ బిల్లులో ముస్లిం వర్గానికి చెందిన వారిపై కక్షసాధింపు తప్పితే ..మహిళల ప్రయోజనాలు లేవని ఈ సందర్భంగా ఓవైసీ వివరించారు. ఒక మతానికి వ్యతిరేకంగాను... రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును తాము తిరస్కరిస్తున్నామని ఓవైసీ వ్యాఖ్యానించారు. వాస్తవానికి త్రిపుల్ తలాక్ బిల్లు రూపొందించే  విషయంలో కేంద్రం ఎవరినీ సంప్రదించలేదని ఆరోపించిన అసదుద్దీన్ ఓవైసీ..స్పీకర్ తన విచక్షణ అధికారుల వినియోగించి త్రిపుల్ తలాక్ బిల్లును తిరిగి సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. 

మతం విషయంలో అతి జోక్యం తగదన్న కాంగ్రెస్
మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ దీనిపై స్పందిస్తూ త్రిపుల్ తలాక్ బిల్లును జేపీసీకి పంపాలని డిమాండ్ చేసింది.  ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు చాలా ముఖ్యమైనదని, రాజ్యాంగపరమైన అంశాలతో కూడుకున్నందున దానిపై అధ్యయనం చేయాల్సి ఉందని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ బిల్లు ప్రవేశంతో రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతోందన్నారు. ఒక మతానికి సంబంధించిన విషయంలో కేంద్రం జోక్యం చేసుకొని చట్టం చేయడం ఎంతవరకు సమంజసమని మోడీ సర్కార్ ను ప్రశ్నించారు. ఈ విషయంలో లోతైన కసరత్తు అవసరమని.. అందుకే దీన్ని పార్లమెంట్ జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపాలని కోరుతున్నమాన్నారు. అయితే దీనికి స్పీకర్ అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసింది.  

బిల్లును వ్యతిరేకించిన తృణమూల్‌, ఆర్ఎస్పీ
జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్నదే విపక్షాల అందరి అభిప్రాయమని తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు సందీప్‌ బందోపాధ్యాయ తెలిపారు.  ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని ఆర్‌ఎస్పీ ఎంపీ ప్రేమ్‌ చంద్రన్‌ స్పష్టంచేశారు. ఈ బిల్లులో రాజకీయ ప్రయోజనాలే కనబడుతున్నాయని ఆయన విమర్శించారు. బిల్లును చట్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తొందరపడుతోందని ఆయన ఆక్షేపించారు.

ముస్లిం మహిళా హక్కుల కోసమేనన్న  బీజేపీ
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ త్రిపుల్ తలాక్ బిల్లు ముస్లిం మహిళలకు రక్షణగా ఉటుందని సమర్ధించుకున్నారు. త్రిపుల్ తలాక్ ను 20 ముస్లిం దేశాలు రద్దు చేశాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాము ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై అభ్యంతరాలు ఉంటే పరిశీలిస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ బిల్లు ఏ కులానికీ, మతానికి, విశ్వాసానికి వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చారు. సమాజంలో మైనార్టీ మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే తామ ఈ బిల్లును రూపొందించాయమని కేంద్రం మంత్రి వివరణ ఇచ్చారు. ఇది పూర్తిగా మైనారిటీ మహిళల హక్కు, వారి న్యాయానికి సంబంధించినదని ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనాల లేవని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. కాబట్టి బిల్లు ఆమెదానికి ప్రతిక్షాలుకు ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన వాదానకు ప్రతిపక్షాల ఏకీభవించలేదు.. బిల్లు విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్ అన్నాడీఎంకే వాటౌట్ చేశాయి. మిగిలన పక్షాలు సభలో ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్షాలు ఆందోళన మధ్యే ఓటించి నిర్వహించిన మోడీ సర్కార్ ఈ బిల్లును ఆమెదింపు జేసుకుంది

ఎట్టకేలకు బిల్లు ఆమోదం...
ఇలా ప్రతిపక్షాలు అడ్డుపడినప్పటికీ  త్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో ఎన్టీయే ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో లోక్ సభలో తమకున్న సంఖ్యాబలంతో మోడీ సర్కార్ ఈ బిల్లులు ఆమోదింపజేసుకుంది. లోక్ సభలో ఆమెదం పొందిన బిల్లు..చట్ట రూపం దాల్చాలంటే ఇక రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది. త్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో మొదటి నుంచి మోడీ సర్కార్ పట్టుదలతో ఉంది. బిల్లును పలు ముస్లిం వర్గాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోకుండా కేబినెట్ ఆమెద్రముద్ర వేసింది. అనంతరం ఈ రోజ లోక్సభలో ప్రవేశపెట్టింది. తలాక్ తలాక్ తలాక్ అంటూ ఒకే సారి మూడు సార్లు చెప్పి అక్కడికక్కడే వివాహాన్ని రద్దుచేసుకునే పద్దతికి స్వస్తి చెప్పాలని సభలోతన వాదనను సమర్ధించుకుంది. ఈ మేరకు బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమెదింపజేసుకుంది. కాగా ఈ బిల్లు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఎంఐఎం పార్టీ సహా దేశంలోని వివిధ ముస్లిం వర్గాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మోడీ సర్కార్ త్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడం గమనార్హం.

 

Trending News