5 State Elections: 6 భారతీయ భాషలలో సెర్చ్ ప్రాంప్ట్‌ను ఆవిష్కరించిన Twitter సంస్థ

Twitter Unveils Search Prompt In six Indian Languages: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ఆరు భారతీయ భాషల్లో సెర్చ్ ప్రాంప్ట్‌ను ప్రారంభించేందుకు యోచిస్తోంది. అభ్యర్థుల జాబితాలు, ఎలక్షన్ ఓటింగ్ తేదీలు, పోలింగ్ బూత్‌ల వివరాలు మరియు ఈవీఎం ఓటరు నమోదు గురించి ఓటర్లు సులభంగా తెలుసుకోవచ్చు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 15, 2021, 07:14 PM IST
  • ఆరు భారతీయ భాషల్లో సెర్చ్ ప్రాంప్ట్‌ను ప్రారంభించనున్న ట్విట్టర్ సంస్థ
  • భారత ఎన్నికల కమిషన్ మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్లతో ట్విట్టర్ భాగస్వామ్యం
  • 6 భాషలలో 20 కన్నా అధికంగా హ్యాష్‌ట్యాగ్‌లకు మద్దతు తెలిపింది
5 State Elections: 6 భారతీయ భాషలలో సెర్చ్ ప్రాంప్ట్‌ను ఆవిష్కరించిన Twitter సంస్థ

Twitter Unveils Search Prompt In 6 Indian Languages: త్వరలో కొన్ని రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ఆరు భారతీయ భాషల్లో సెర్చ్ ప్రాంప్ట్‌ను ప్రారంభించేందుకు యోచిస్తోంది. ఇందుకోసం, ఎన్నికల సంబంధిత అంశాలతో పాటు అభ్యర్థుల జాబితాలు, ఎలక్షన్ ఓటింగ్ తేదీలు, పోలింగ్ బూత్‌ల వివరాలు మరియు ఈవీఎం ఓటరు నమోదు గురించి విశ్వసనీయమైన మరియు అధికారిక సమాచారాన్ని ఓటర్లు సులభంగా తెలుసుకోవచ్చు.

భారత ఎన్నికల కమిషన్ మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ల భాగస్వామ్యంతో మైక్రో బ్లాగింట్ సైట్ ట్విట్టర్(Twitter New Feature) ఈ సదుపాయాన్ని కల్పించేందుకు సిద్ధంగా ఉంది. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను బట్టి బెంగాలీ, తమిళం, మలయాళం, అస్సామీ, హిందీ, మరియు ఇంగ్లీష్ భాషలలో ‘ఎలక్షన్ ఇన్ఫర్మేషన్ ప్రాంప్ట్’ను అందించనుంది. ప్రాంప్ట్ పేర్కొన్న ఈ 6 భాషలలో 20 కన్నా అధికంగా హ్యాష్‌ట్యాగ్‌లకు మద్దతు తెలిపింది.

Also Read: EPFO: ఖాతాదారులు కంపెనీ మారుతున్నారా, ఇకనుంచీ EPF Transfer తలనొప్పి ఉండదు

అంతేకాకుండా ట్విట్టర్ తాజాగా అసెంబ్లీ ఎలక్షన్స్ 2021 (Assembly Elections 2021) కోసం కస్టమ్ ఎమోజీ తీసుకువచ్చింది. ఇది తమ ఓటు హక్కును వినియోగించుకున్న పౌరులు సిరా వేలును చూపిస్తున్నట్లుగా ఉంటుంది. ఈ ఎమోజీ మే నెల 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ట్విట్టర్ తెలిపింది. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం, అస్సామీ మరియు తమిళ భాషలలో ట్వీట్ చేసేవారు ఆ ఎలక్షన్ ఎమోజీని యాక్టివేట్ చేసుకోవచ్చు.

Also Read: Jasprit Bumrah Wedding Photos: టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా మ్యారేజ్ ఫొటో గ్యాలరీ

ఈ ప్రాంప్ట్‌లు ట్విట్టర్ ఖాతాదారుల హోమ్ టైమ్‌లైన్‌లో దర్శనమివ్వనున్నాయి. వీటి సహాయంతో ఓటు నమోదు చేసుకోవడం ఎలా,  EVM, మరియు VVPATల వివరాలు తెలుపుతుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని పోలింగ్ బూత్‌లు, పోస్టల్ బ్యాలెట్లు, COVID-19 నియమాలు లాంటి ఓటింగ్ సంబంధిత  సమాచారాన్ని నెటిజన్లకు అందించేందుకు ట్విట్టర్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
Also Read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శాలరీని ఈ లెక్కలతో అంచనా వేస్తున్నారు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News