హ్యాట్సాఫ్.. ఆ జవాన్ల కోసం 61000 కి.మీ ప్రయాణం

జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులై నేటికి ఏడాది కావొస్తుంది. ఈ నేపథ్యంలో వారి స్మరణార్థం లెత్‌పోరాలో స్మారకస్తూపాన్ని ఏర్పాటు చేశారు.

Shankar Dukanam Shankar Dukanam | Updated: Feb 14, 2020, 11:04 AM IST
హ్యాట్సాఫ్.. ఆ జవాన్ల కోసం 61000 కి.మీ ప్రయాణం
Photo Courtesy: Twitter/ANI

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి నేటికి సరిగ్గా ఏడాది అవుతోంది. ఫిబ్రవరి 14, 2019న పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. పుల్వామా దాడిలో ప్రాణాలు అమరులైన జవాన్ల త్యాగాలకు గుర్తుగా జమ్మూకాశ్మీర్ లోని లెత్‌పోరా శిబిరంలో స్మారకస్తూపాన్ని నేడు ఆవిష్కరించారు. స్మారకస్తూపంపై ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల పేర్లు, ఫొటోలను ముద్రించి వారికి ఘన నివాళులు అర్పించారు. ఇదే వారికి అసలైన నివాళి అని సీఆర్పీఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జుల్ఫికర్ హసన్ అన్నారు. 

Also Read: పూల్వామా తరహా దాడికి కుట్ర

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మహారాష్ట్రకు చెందిన ఉమేష్ గోపీనాథ్ యాదవ్ హాజరయ్యారు. ఉగ్రదాడిలో అమరులైన 40 మంది జవాన్ల ఇంటింటికి వెళ్లి వారి ఇంట్లోని మట్టిని, అంత్యక్రియలు జరిగిన స్థలంలో మట్టిని ఉమేష్ సేకరించారు. ఇందుకోసం ఏకంగా దేశ వ్యాప్తంగా 61000 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. అమరులైన జవాన్ల కుటుంబాలను కలుసుకుని వారికి నైతిక మద్దతు తెలిపారు.

అమర జవాన్ల కుటుంబసభ్యుల నుంచి ఆశీర్వాదం తీసుకుని లెత్‌పోరాకు చేరుకున్నారు ఉమేష్. ఆ జవాన్ల కుటుంబాలను కలినందుకు తనకు చాలా గర్వంగా ఉందన్నారు. #PulwamaAttack జరిగి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అమరలకు ఏర్పాటు చేసిన స్మారకస్థూపం వద్ద నివాళులర్పించారు. జవాన్లకు అంత్యక్రియలు నిర్వహించిన చోటు నుంచి, వారి ఇళ్ల నుంచి సేకరించిన మట్టిని స్తూపం వద్ద సమర్పించారు.

Also Read: ఎల్పీజీ సబ్సిడీ రెట్టింపు చేసిన సర్కార్

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..