బెంగళూరులోని త్యాగరాజనగర్‌లో శనివారం రాత్రి నిర్మాణంలో ఉన్న ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం అదృష్టవశాత్తుగా ఈ ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి హానీ జరగలేదనే తెలుస్తోంది. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. అటువంటి ఫిర్యాదులు అందిన దాఖలాలు సైతం లేవని సమాచారం.
భవనం కూలిపోయినట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు మొదలుపెట్టారు. ఈ ఘటనలో కూలిపోయిన భవనానికి పక్కనే ఆనుకుని ఉన్న మరో భవనం సైతం పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.