ఇండియాలో బిట్‌కాయిన్స్‌తో ఇక ఏదీ కొనలేరు !

ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2018 బడ్జెట్‌ ప్రసంగంలో క్రిప్టో కరెన్సీ ప్రస్తావన

Last Updated : Feb 1, 2018, 04:51 PM IST
ఇండియాలో బిట్‌కాయిన్స్‌తో ఇక ఏదీ కొనలేరు !

ఇండియాలో బిట్‌కాయిన్స్ వినియోగం ఇకపై కష్టమే అనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన 2018 బడ్జెట్‌లో బిట్‌కాయిన్స్ లాంటి క్రిప్టో కరెన్సీ ప్రస్తావన తీసుకురావడమే అందుకు కారణం. అవును, తన బడ్జెట్ ప్రసంగంలో క్రిప్టో కరెన్సీ గురించి ప్రస్తావించిన అరుణ్ జైట్లీ.. "భారత్‌లో క్రిప్టో కరెన్సీపై నిషేధం విధించడం లేదు కానీ.. భారత్‌లో చెల్లింపులకు క్రిప్టోకరెన్సీ వినియోగాన్ని అనుమతించబోం" అని అన్నారు. మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ఈ ప్రకటన ఇండియాలో బిట్‌కాయిన్స్ వినియోగం ఇబ్బందికరమైనదే అని చెప్పకుండానే చెప్పినట్టు అర్థమవుతోంది అంటున్నారు ఆర్ధిక నిపుణులు.

దేశంలో అక్రమంగా జరిగే ఆర్థిక లావాదేవీలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆర్ధిక లావాదేవీలలో భాగంగా ఎన్‌క్రిప్షన్ పద్ధతిలో డిజిటల్ చెల్లింపులు జరిపే మరో ప్రత్యామ్నాయ మాధ్యమమే ఈ క్రిప్టో కరెన్సీ. ఇటీవల కాలంలో ఈ బిట్‌కాయిన్స్ వినియోగంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఈ బిట్‌కాయిన్స్‌ని నిషేధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం కూడా వినిపించింది. 

Trending News