Budget 2022: ఈసారి ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్స్, 80సీ 80సీసీడీ మినహాయింపుల్లో మార్పు ఉంటుందా?

Expectations of Union Budget 2022: ఎప్పటిలాగే ఈ ఏడాది బడ్జెట్ కోసం సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో తమకు ప్రయోజనం చేకూర్చే అంశాలేమైనా బడ్జెట్‌లో ఉంటాయా అని చర్చించుకుంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2022, 07:24 PM IST
  • ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సీతారామన్
  • ఈసారి ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్స్‌లో మార్పులు ఉంటాయా
  • ట్యాక్స్ మినహాయింపు పరిమితిని పెంచాలని కోరుకుంటున్న జనం
Budget 2022: ఈసారి ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్స్, 80సీ 80సీసీడీ మినహాయింపుల్లో మార్పు ఉంటుందా?

Expectations of Union Budget 2022: బడ్జెట్ అనగానే వేతన జీవులు ట్యాక్స్ మినహాయింపులపై ఆరా తీస్తారు. కేంద్ర బడ్జెట్‌కు మరో రెండు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో.. ట్యాక్స్ మినహాయింపులు ఎలా ఉండబోతున్నాయనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చివరిసారిగా 2014లో ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్‌లను సవరించగా... గతేడాది బడ్జెట్ వరకు అవే స్లాబులను కొనసాగించారు. ఈ ఏడాదైనా ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబుల్లో మార్పు ఉంటుందా.. పన్ను చెల్లింపుదారులకు మినహాయింపు పరిమితిని పెంచుతారా అన్నది చూడాలి.

ప్రాథమిక మినహాయింపు పరిమితిని పెంచుతారా?

నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది.. అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు పెంచారు. అంటే... రూ.2.5లక్షల వార్షిక ఆదాయం కలిగి ఉన్నవారికి ఎలాంటి పన్ను విధించబడదు. అలాగే సీనియర్ సిటిజెన్లకు పన్ను పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచారు. అప్పటినుంచి ఇప్పటివరకూ వీటిని మళ్లీ సవరించలేదు. 

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే తాజా బడ్జెట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రాథమిక పరిమితిని పెంచవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీన్ని రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెంచే అవకాశం ఉందంటున్నారు. అలాగే సీనియర్ సిటిజెన్లకు పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచవచ్చునని చెబుతున్నారు.

80సీ, 80 సీసీడీ పన్ను మినహాయింపు పెంచుతారా?

సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్, ఎల్ఐసీ ప్రీమియం, ఈక్విటీ సంబంధిత సేవింగ్ స్కీమ్స్‌ మొదలైన వాటిల్లో పెట్టుబడిపై ప్రస్తుతం రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు ఇవ్వబడుతోంది. 2014లో రూ.1లక్ష వరకు ఉన్న ఈ పరిమితిని రూ.1.5లక్షలకు పెంచారు. అప్పటినుంచి ఇప్పటివరకూ దీనిలో ఎలాంటి మార్పులు చేయలేదు. 80సీసీడీ కింద నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి రూ.50వేలు మినహాయింపునిస్తున్నారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై రూ.25వేలు వరకు మినహాయింపునిస్తున్నారు. తాజా బడ్జెట్‌లో ఈ పరిమితిని పెంచుతారా.. లేక పాత మినహాయింపులనే కొనసాగిస్తారా చూడాలి. 

ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్స్‌లో మార్పు ఉంటుందా?

ప్రస్తుతం పాత, కొత్త పన్ను విధానాల్లో (Budget 2022) ప్రాథమిక పరిమితి రూ.2.5 లక్షలుగానే ఉంది. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయం ఉన్నవారికి 5శాతం పన్ను విధిస్తున్నారు. రూ.5 లక్షలు-రూ.7.5 లక్షలు ఆదాయం ఉన్నవారికి పాత విధానంలో అయితే 20 శాతం, కొత్త విధానంలో అయితే 10 శాతం పన్ను విధిస్తున్నారు. రూ.7.5 లక్షలు-రూ.10లక్షలు ఆదాయం ఉన్నవారికి పాత విధానంలో 20 శాతం, కొత్త విధానంలో 15 శాతం పన్ను విధిస్తున్నారు. పాత పన్ను విధానంలో రూ.10లక్షలు ఆదాయం పైబడినవారికి 30 శాతం పన్ను విధిస్తున్నారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్నవారికి సెక్షన్ 87 ఏ ప్రకారం రూ.12,500 వరకు ట్యాక్స్ రిబేట్ అవకాశం కల్పిస్తున్నారు. ఈ లెక్కన రూ.5లక్షల వరకు ఆదాయం కలిగినవారు పన్ను మినహాయింపు పొందుతున్నట్లే. తాజా బడ్జెట్‌లో ఇవే స్లాబ్‌లను కొనసాగిస్తారా లేక మార్పులు ఉంటాయా వేచి చూడాలి.
 

Also Read: ఐటమ్ సాంగ్ కోసం 5 కోట్లు తీసుకున్న సమంత.. సన్నీ లియోన్, కత్రినా కైఫ్ ఎంత వసూలు చేసారంటే?

Also Read: Viral Video: పెళ్లి వేడుకలో వధువుకు సోదరుల వినూత్న ఆహ్వానం.. గుండెలు పిండేస్తున్న వీడియో!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News