కాశ్మీర్‌లో రాళ్లురువ్వే వారిని పట్టుకొనే కొత్త టెక్నిక్

జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలపై రాళ్లు రువ్వే ఆందోళనకారులను పట్టుకొనేందుకు శుక్రవారం అక్కడి పోలీసులు కొత్త  టెక్నిక్‌ను కనిపెట్టారు.

Updated: Sep 9, 2018, 07:05 PM IST
కాశ్మీర్‌లో రాళ్లురువ్వే వారిని పట్టుకొనే కొత్త టెక్నిక్

జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలపై రాళ్లు రువ్వే ఆందోళనకారులను పట్టుకొనేందుకు శుక్రవారం అక్కడి పోలీసులు కొత్త  టెక్నిక్‌ను కనిపెట్టారు. రాళ్లు రువ్వే వారి మాదిరిగానే ముఖానికి ముసుగు వేసుకొని ఆందోళనకారుల పక్కకు వెళ్లి వాళ్లను పట్టుకోవడమే ఈ కొత్త టెక్నిక్.

ఈ కొత్త టెక్నిక్‌ని పోలీసులు శుక్రవారం అమలు చేశారు. శ్రీనగర్‌లోని పాతబస్తీలోని జామా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనలు ముగియగానే కొందరు ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై రాళ్లు విసరడం ప్రారంభించారు. కొద్దిసేపటికే ఆందోళనకారుల సంఖ్య వందకు చేరింది. గుంపులో నుంచి ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. వారిని తరిమికోట్టేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. అప్పటికే ఆందోళనకారుల్లో కలిసిపోయి ఉన్న పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను పట్టుకొని వచ్చేశారు. ప్రస్తుతం వారిని పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్లి తమదైన స్టైల్‌లో విచారిస్తున్నారు.

కాశ్మీర్‌లో రాళ్లురువ్వే వారిని పట్టుకొనే కొత్త టెక్నిక్

రాళ్లు రువ్వే ఆందోళనకారులను పట్టుకోవడానికి 2010లోనే ఇలాంటి వ్యూహాన్ని అమలుచేసినట్లు కొందరు పోలీసులు చెబుతున్నారు.

కాగా.. ఈ కొత్త టెక్నిక్‌పై సోషల్ మీడియాలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పోలీసులే ఇలా చేయడమేంటని కొంతమంది విమర్శిస్తే.. పోలీసులు చేస్తున్నది కరెక్ట్ అంటూ మరికొందరు సమర్థిస్తున్నారు.