ఎస్పీ బీఎస్పీ దోస్తీపై యూపీ సీఎం యోగీ సెటైర్లు

చివరి దశ ఎన్నికల ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో యోగి ఆదిత్యనాథ్‌  విస్తృత పర్యటనలు చేస్తున్నారు.

Last Updated : May 14, 2019, 03:02 PM IST
ఎస్పీ బీఎస్పీ దోస్తీపై యూపీ సీఎం యోగీ సెటైర్లు

ఎస్పీ బీఎస్పీ దోస్తీపై యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్ సెటైర్లు సంధించారు.  గోరఖ్‌పూర్‌ నుంచి పోటీ చేస్తున్న భాజపా  అభ్యర్థి  రవికిషన్‌కి మద్దతుగా యోగీ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఏనుగు బరువుకు సైకిల్‌ పంక్చర్‌ ఖాయం’అంటూ ఎస్పీ, బీఎస్పీని ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కుంభమేళా సందర్భంగా ప్రధాని మోడీ పారిశుద్ధ్య కార్మికుల పాదాలను  కడగడాన్ని ప్రస్తావించిన యోగి ఆధిత్యనాథ్... పురాణాల్లో  సుధామా కాళ్లని కృష్ణుడు శుభ్రం చేయడంతో పోల్చారు

రాహుల్ ఎవరిని పూజించారు...?
శ్రీరాముడు, కృష్ణుడు ఉన్నట్లు ఎక్కడా లేదని గతంలో కాంగ్రెస్‌ వారు సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారని.. మరి అలా అయితే ఆలయాల్ని సందర్శించినప్పుడు రాహుల్‌ గాంధీ ఎవర్ని పూజిస్తున్నారని యోగి ప్రశ్నించారు. కేవలం చివరి దశ ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్‌ ఆయా నియోజకర్గాల్లో విస్తృత పర్యటనలు చేస్తున్నారు.ఈ క్రమంలో ప్రతిపక్షాలపై విమర్శల దాడి చేస్తున్నారు

Trending News